రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభవార్త అందించారు. మే నెల నుంచి పూర్తి జీతాలు చెల్లించేందుకు వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం లాక్డౌన్ సడలింపులతో ఆర్థిక కార్యకలాపాలు జోరందుకున్నాయని, ఇకనుంచి ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించకూడదని ఏపీ సర్కార్ నిర్ణయించింది. విమాన ప్రయాణికులకు మార్గదర్శకాలు విడుదల
సీఎం వైఎస్ జగన్ సూచన మేరకు మే నెల నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తిస్థాయిలో వేతనాలు చెల్లించాలని ఫైనాన్స్, ట్రెజరీ సంబంధిత శాఖలకు ఆదేశాలు అందాయి. వేతనాల చెల్లింపులపై ట్రెజరీ సాఫ్ట్‌వేర్‌లో సీఎఫ్ఎంఎస్లో మార్పులు చేయనున్నారు. సీఎం వైఎస్ జగన్ నిర్ణయంపై ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రానా, మిహికా ఎంగేజ్మెంట్ ఫొటోలు వచ్చేశాయ్..
లాక్డౌన్ తర్వాత ఆర్థిక పరిస్థితి మందగించిన కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఐఏఎస్, ఐపీఎస్, కేంద్ర సర్వీసులు ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడం తెలిసిందే. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ ఉద్యోగులకు పూర్తి స్థాయి వేతానాలను చెల్లించలేదు. గత కొన్ని రోజులుగా ఏపీలోనూ లాక్డౌన్ నిబంధనలు సడలించడం, ఆర్థిక కార్యకలాపాలు సజావుగా సాగుతుండటంతో ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించాలని సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్