ఎంఫాన్ తుఫాన్.. పశ్చిమ బెంగాల్‌లో బీభత్సం సృష్టించింది. ఆరు గంటలపాటు ఈదురుగాలులు, భారీ వర్షంతో అంతా అతలాకుతలమైంది. ఎంఫాన్ దెబ్బకు పశ్చిమ బెంగాల్‌లో 12 మంది మృతి చెందారు.
దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో రాకాసి గాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో కోల్‌కతాలో చాలా చోట్ల పెద్ద పెద్ద వృక్షాలు.. వేళ్లతో సహా విరిగి పడిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో జనం కరెంటు కష్టాలు ఎదుర్కొంటున్నారు. అక్కడక్కడా చెట్లు వాహనాలపై పడ్డాయి. దీంతో పలు వాహనాలు నాశనమయ్యాయి.
భారీగా కురిసిన వర్షానికి కోల్‌కతాలో చాలా ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోవడంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కోల్‌కతాలోని ఎయిర్ పోర్టు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. రన్ వే పైనా నీరు నిలిచిపోయి ఉంది. ప్రస్తుతం కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ప్రయాణీకుల విమాన సర్వీసులు బంద్ అయ్యాయి. కానీ కార్గో విమానాలు నడుస్తున్నాయి. ఐతే ఎయిర్ పోర్టులో నీరు నిలిచిపోవడంతో కార్గో విమాన సర్వీసులను కూడా రద్దు చేశారు.
Kolkata Airport...
How many so called "National Channels" are discussing devastation caused by #Amphan in Bengal?
( Video received from a friend) pic.twitter.com/mh7aMzPzRB— Dwai (@BujMit) May 21, 2020
ఎంఫాన్ తుఫాన్.. పశ్చిమ బెంగాల్ ను కోలుకోని దెబ్బతీసిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. తుఫాన్ ప్రభావాన్ని ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఉండి పరిశీలించిన ఆమె.. దాదాపు లక్ష కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఆర్ధికంగా నష్టపోయి ఉన్న.. తమకు ఇది మరింత భారం కానుందని తెలిపారు.
Kolkata airport is a sea now. Will take days to get things running after #amphan.
Video from WA. @aaikolairport pic.twitter.com/beWUEORoDF
— Subhayan Chakraborty শুভায়ন চক্রবর্তী (@Subhayan_ism) May 21, 2020
మరోవైపు తీరం దాటిన తర్వాత ఎంఫాన్ తుఫాన్ బలహీనపడింది. ప్రస్తుతం ప్రతి గంటకు 27 కిలోమీటర్ల వేగంతో బంగ్లాదేశ్ వైపు కదులుతోంది. ఇది మరో మూడు గంటల్లో మరితంగా బలహీనపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ..IMD వెల్లడించింది..జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
ఎంఫాన్ దెబ్బకు అతలాకుతలం..!!