'కరోనా వైరస్' కరాళ నృత్యం చేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా రెండోసారి లాక్ డౌన్ పొడగించారు. మే 17వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంటుందని కేంద్రం ప్రకటించింది.
ఈ క్రమంలో చాలా చోట్ల ఉన్న జనం ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా వలస కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐతే వారి కోసం కేంద్ర ప్రభుత్వం శ్రామిక్ రైళ్లు నడిపించాలని నిర్ణయించింది. ఐతే కొంత మంది వలస కూలీలు ప్రయివేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. అలాంటి ఓ ఘటనే మధ్యప్రదేశ్ లో కనిపించింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో వాహనాలను చెక్ చేస్తున్న పోలీసు సిబ్బందికి ఆశ్చర్యకరమైన విషయం వెలుగు చూసింది.
కొంత మంది వలస కార్మికులు ఓ కాంక్రీట్ మిక్సర్ ట్యాంక్ ఉన్న ట్రక్కులో ప్రయాణించడం పోలీసుల తనిఖీల్లో బయటపడింది. దీంతో మిక్సర్ ట్యాంక్ లో ఉన్న కార్మికులను బయటకు దింపగా... ఏకంగా ఆ ట్యాంకులో నుంచి 18 మంది వలస కార్మికులు బయటకు వచ్చారు. వారంతా మహారాష్ట్ర నుంచి ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోకు వెళ్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది.
#WATCH 18 people found travelling in the mixer tank of a concrete mixer truck by police in Indore, Madhya Pradesh. DSP Umakant Chaudhary says, "They were travelling from Maharashtra to Lucknow. The truck has been sent to a police station & an FIR has been registered". pic.twitter.com/SfsvS0EOCW
— ANI (@ANI) May 2, 2020
వారందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం వారిని క్వారంటైన్ కేంద్రానికి తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..