సమంత మజిలీ..!!

టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరు సమంత. దశాబ్దకాలంగా భారత సినీ పరిశ్రమలో రాణిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. తమిళ, తెలుగు చిత్రాల్లో అగ్ర కథానాయికగా వెలుగొందుతోంది. నేడు ఆమె పుట్టిన రోజు. సమతం 34వ పడిలోకి అడుగుపెడుతున్న  సందర్భంగా ఆమె సినీ ప్రయాణం గురించి తెలుసుకుందాం.

Last Updated : Apr 28, 2020, 03:35 PM IST
సమంత మజిలీ..!!

టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరు సమంత. దశాబ్దకాలంగా భారత సినీ పరిశ్రమలో రాణిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. తమిళ, తెలుగు చిత్రాల్లో అగ్ర కథానాయికగా వెలుగొందుతోంది. నేడు ఆమె పుట్టిన రోజు. సమతం 34వ పడిలోకి అడుగుపెడుతున్న  సందర్భంగా ఆమె సినీ ప్రయాణం గురించి తెలుసుకుందాం.

1987 ఏప్రిల్ 28న చెన్నైలో జన్మించింది సమంత. తల్లిదండ్రులు రూత్ ప్రభు, నైనెట్టే. తండ్రి తెలుగు వారు కాగా.. తల్లి మలయాళీ. పుట్టింది, పెరిగింది అంతా చెన్నైలోనే కావడంతో సమంత .. తను తాను తమిళ అమ్మాయిగానే చెబుతుంది. అక్కినేని వారి కోడలు కావడంతో ఇప్పుడు తెలుగుంటి ఆడపడుచుగా మారిపోయింది. 

చెన్నైలోనే చదువు పూర్తి చేసుకున్న తర్వాత మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది సమంత. నాయుడు హాల్ అనే ఫంక్షన్ హాలులో పాకెట్ మనీ కోసం పని చేసేది. అప్పట్లో సొంత ఇళ్లు కట్టుకోవాలని కలకు కనేది. ఆ కలనే తను సినీ రంగంలోకి ప్రయాణించేందుకు అడుగులు వేయించిందని చెప్పవచ్చు. నాయుడు హాల్ లోనే ఆమెకు రవివర్మ అనే సినీ రచయిత, దర్శకుడు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆమె 2010లో సినీ రంగ ప్రవేశం చేసింది.

ప్రముఖ దర్శకుడు గౌతమ్ మేనన్ దర్శకత్వంలో తొలి సినిమా  'ఏం మాయ చేసావే'తో తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది. ఈ సినిమా  తమిళంలోనూ విడుదల కావడంతో రెండు సినీ పరిశ్రమల్లో ఒక్కసారిగా సమంత పేరు మారుమోగిపోయింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. ఇప్పటికీ చేసే ప్రతి సినిమాను తొలిసినిమాలాగే భావించడం ఆమెకు అలవాటు. 

సినిమాల్లో గ్లామరస్ హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా .. 'మంచి కథానాయిక' అనిపించుకునే పాత్రలు ఎంచుకున్నారు సమంత. అందుకే సినీ పరిశ్రమలో అగ్రకథానాయికగా వెలుగొందుతున్నారంటే అతిశయోక్తి కాదు. 'యూటర్న్', 'ఓ బేబీ', పల్లెటూరి పిల్లగా నటించిన 'రంగస్థలం', అల్లరిపిల్లగా నటించిన 'అ ఆ' అదే కోవలోకి వస్తాయి.

 
 సమంత 2012లో  అనారోగ్యంతో బాధపడ్డారు. 15 రోజులు మంచానికే పరిమితమయ్యారు. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత.. తనలాగా పేద మహిళలు, పిల్లలు ఎవరూ బాధపడకూడదని నిర్ణయించుకున్నారు. అందుకే ప్రత్యూష అనే పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. తన సంపాదన నుంచి కొంత మొత్తాన్ని ప్రత్యూష సంస్థకు కేటాయిస్తూ వస్తున్నారు. అనేక మందిపేద మహిళలు, పిల్లకు ప్రాణదానం చేస్తున్నారు. 
 
తెలంగాణలో చేనేత కార్మికులకు వెన్నుదన్నుగా నిలిచారు సమంత. చేనేత కార్మికులు తయారు చేసిన చీరలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. తెలంగాణ వీవ్ పేరుతో ఓ స్టోర్ ను కూడా ప్రారంభించారు. చేనేత కార్మికులు నేసిన చీరలతో ఫోటోలు దిగి వాటిని ప్రమోట్ చేశారు. ఈ రోజు(మంగళవారం) ఆమె పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా జీ హిందూస్తాన్ కూడా ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతోంది. Happy birth day samantha.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News