/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

'కరోనా వైరస్'.. ప్రపంచవ్యాప్తంగా మృత్యుక్రీడ ఆడుతోంది. వైరస్ కరాళ నృత్యానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు లాక్ డౌన్ పరిధిలోకి వెళ్లిపోయాయి. రోడ్ల మీద వాహనాలు బంద్ అయ్యాయి. ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. వ్యాపారాలు, దుకాణాలు తెరుచుకోవడం లేదు. దీంతో అన్ని దేశాల్లో స్తబ్దత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో కరోనా వైరస్ కారణంగా ప్రకృతికి మంచే జరుగుతోంది. 

అవును.. మీరు చదివింది నిజమే..!! కాలుష్య కోరల్లో  చిక్కుకున్న ప్రకృతి.. ఇప్పుడు స్వచ్ఛంగా రూపుదిద్దుకుంటోంది. దీనికి ప్రధాన కారణం. . కరోనా వైరస్ లాక్ డౌన్ అని చెప్పక తప్పదు.  లాక్ డౌన్ కారణంగా కాలుష్యం వెదజల్లె ఫ్యాక్టరీలు మూత పడ్డాయి. దీంతో నదులన్నీ స్వచ్ఛంగా ప్రవహిస్తున్నాయి. గాలిలో కాలుష్య స్థాయి చాలా వరకు తగ్గింది. గతంలో కాలుష్య జాబితాలో ఉన్న భారత నగరాలన్నీ ..  ఆ  జాబితా నుంచి బయటపడడమే దీనికి ఉదాహరణ. 

మరోవైపు నిత్యం ప్రవహించే గంగా నది  కూడా కాలుష్య కోరల నుంచి బయటపడింది. గతంలో గంగా నది నీళ్లు .. కనీసం స్నానం చేసేందుకు కూడా పనికి రావని చెప్పేవారు. ఇప్పుడు ఏకంగా తాగేందుకు కూడా గంగానదీ  జలాలు తయారయ్యాయి. గతంలో గంగానదిని శుద్ధి చేసేందుకు ప్రభుత్వాలు ఎంతో ప్రయత్నించాయి. కానీ వారికి సాధ్యం కానిది.. కరోనా వైరస్ లాక్ డౌన్ చేసి చూపించింది.

ఉత్తరాఖండ్ కాలుష్య నియంత్రణ బోర్డు.. హరిద్వార్, రిషికేష్‌లో గంగా నదీ జలాల శాంపిల్స్ తీసుకుని పరీక్షకు పంపించింది. 2000 సంవత్సరం తర్వాత ఇంత మంచి ఫలితాలు ఎప్పుడూ రాలేదని ఉత్తరాఖండ్ కాలుష్య  నియంత్రణ బోర్డు వెల్లడించింది. గంగా నదీ జలాలు ఇప్పుడు తాగేందుకు కూడా మంచివేనని తెలపడం విశేషం.

హరిద్వార్‌లో సేకరించిన గంగా జలాలు క్లాస్ -A కేటగిరీ కిందకు వచ్చాయి. గతంలో ఇక్కడి జలాలు క్లాస్ -B కింద ఉండేవి. అంటే వాటిని స్నానం చేసేందుకు, ఇతర అవసరాలకు మాత్రమే వాడుకోవచ్చన్నమాట. కానీ ఇప్పుడు క్లాస్ -A కిందకు ఆ గంగా జలాలు శుద్ధి కావడంతో .. వాటిని తాగేందుకు వీలుపడుతుంది.  
  
మరోవైపు గంగా జలాల్లో ఆక్సిజన్ శాతం 20 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా గంగా నదిలో జీవించే జలచరాల జీవిత కాలం పెరుగుతుందని నివేదికలో వెల్లడైంది. లాక్ డౌన్ కారణంగా  గంగా నదిలోకి కాలుష్య జలాలు రావడం లేదు. పైగా మనుషులు వేసే చెత్త, చెదారం అంతా బంద్ అయిపోయింది. దీంతో  మొత్తంగా 80  శాతం వరకు శుద్ధిగా మారిపోయినట్లు తెలుస్తోంది.
 
 గంగా నదిని శుద్ధి చేసేందుకు గత 34 ఏళ్లలో దాదాపు 30 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు ఎన్నడూ రాకపోవడం విశేషం. కేవలం 25 రోజుల లాక్ డౌన్ కారణంగా చక్కటి ఫలితాలు వెలువడడం విశేషం.  గంగా నది మాత్రమే కాదు  దేశంలోని చాలా నదుల్లోనూ ఇలాంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. 

మరోవైపు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కతా లాంటి ప్రధాన నగరాల్లో గాలి కాలుష్యం విపరీతంగా తగ్గింది. ఆయా నగరాల్లో స్వచ్ఛమైన గాలి
నాణ్యత పెరగడమే ఇందుకు ఉదాహరణ. మొత్తంగా కరోనా వైరస్ ప్రకృతికే మంచే చేసింది. మానవాళికి స్వేచ్ఛా వాయువులు
పీల్చుకునే అవకాశం కల్పించింది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Section: 
English Title: 
For first time since 2000, water in Ganga at Haridwar, Rishikesh become drinkable amid coronavirus lockdown
News Source: 
Home Title: 

ఆ గంగ ఇప్పుడు సుజల గంగ..!!

ఆ గంగ ఇప్పుడు సుజల గంగ..!!
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ఆ గంగ ఇప్పుడు సుజల గంగ..!!
Publish Later: 
No
Publish At: 
Thursday, April 23, 2020 - 09:14