న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రభావంతో ఇప్పటికే ఎన్నో పెళ్లిళ్ల తేదీలు, పెళ్లి ముహూర్తాలు ఖరారైనప్పటికీ చాలా మంది రద్దు చేసుకున్నారు. కరోనా విజృంభణ తగ్గిన తర్వాత పెళ్లికి ప్రణాళిక చేసుకోవాలని యోచిస్తున్నారు. అయితే ఈ విపత్కర పరిస్థితుల్లో పోలీస్ కానిస్టేబుల్ పెళ్లి జరిగిపోయింది. హపూర్ కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ మోహ్ సీన్ సైఫి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ కాల్ ద్వారా పెళ్లి కార్యక్రమం పూర్తి చేసుకున్నాడు. మా కుటుంబం ఏప్రిల్ 11న నా పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసిందని, లాక్ డౌన్ కారణంగా పెళ్లికి ఆలస్యమైందని అన్నారు. మా అమ్మ ఆరోగ్యం బాగా లేదని, నా పెళ్లి చూడాలనేది ఆమె కోరికని అందుకే వీడియో కాన్ఫరెన్స్ కాల్ ద్వారా పెళ్లి చేసుకున్నానని మోహ్ సీన్ సైఫి మీడియాతో చెప్పాడు. కరోనా ను నియంత్రించేందుకు లాక్ డౌన్ రూల్స్ పాటిస్తూ..ఇమామ్, ఇద్దరు సాక్షుల సమక్షంలో పెళ్లి కార్యక్రమం పూర్తి చేసుకున్నట్లు వెల్లడించాడు. ఆహ్వానితులంతా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పెళ్లిలో పాల్గొన్నట్లు తెలిపాడు.
Also read : Young talent: ఆర్జీవీని ఫిదా చేసిన సాంగ్.. క్రియేటివిటీ అద్భుతం
మరోవైపు భారత్లో కరోనా మహమ్మారి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ రోజు సాయంత్రం 5గంటల సమయానికి దేశ వ్యాప్తంగా 18,985 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఈ మహమ్మారితో పోరాడి ఇప్పటివరకు 3260 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 603 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..