న్యూఢిల్లీ: కరోనా నిర్ధారణ పరీక్షలు అందరికీ ఉచితంగా నిర్వహించాలని గతంలో పేర్కొన్న సుప్రీం కోర్టు తాజాగా తన నిర్ణయాన్ని సవరించుకుంది. కరోనా టెస్టులు పేదవారికి మాత్రమే ఉచితంగా చేయాలని స్పష్టం చేసింది. ఇందులో ఉచితంగా కరోనా టెస్టులు వర్తింపజేయాలనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించుకోవాలని సూచించింది. ఐదు రోజుల క్రితం అందరికీ ఉచితంగా కరోనా పరీక్షలు అందబాటులోకి తేవాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొనగా, తాము ఉచితంగా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించలేమని ప్రైవేటు ప్రయోగాశాలలు స్పష్టం చేస్తున్న ఈ నేపథ్యంలోనే సుప్రీం తన నిర్ణయాన్ని సవరించుకుంది.
Read Also: అమెరికాలో మరో మర్కజ్.. కరోనా కేసుల పెరుగుదలకు ఆ ఔషధ కంపెనీయే కారణమా?
మరోవైపు ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం కింద లబ్దిపొందుతున్నవారు, బలహీన వర్గాల కేటగిరీలో ప్రభుత్వ గుర్తింపు పొందినవారిని అర్హులుగా గుర్తించి వారికి ఉచిత కరోనా నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది. అయితే బలహీన వర్గాల్లో ఎంతమందికి ఈ వెసులుబాటు కలుగుతుందో కేంద్రం, రాష్ట్రాల ఆరోగ్య మంత్రిత్వ శాఖలు నిర్ణయించుకోవచ్చని మరోసారి అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Read Also: తెలంగాణను వణికిస్తోన్న మర్కజ్ కేసులు.. ఆందోళనలో వైద్య సిబ్బంది..