Maharashtra Corona Deaths| కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం భారత్‌లోనూ అధికమవుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర ప్రజలను ప్రాణాంతక వైరస్ కబలిస్తోంది. దేశంలోనే అత్యధికంగా కరోనా వైరస్ మరణాలు, పాజిటివ్ కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయని తెలిసిందే. కోవిడ్19 దాటికి మహారాష్ట్ర ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఏప్రిల్ 12న (ఆదివారం) ఒక్కరోజే మరో 221 మంది కరోనా బారిన పడ్డారు. హీరోతో లవ్ మ్యారేజ్‌కు ‘టెన్త్ క్లాస్’ భామ రెడీ!
కరోనా కాటుకు రాష్ట్రంలో 22 మంది బలయ్యారు. ఓవరాల్‌గా మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 149కి చేరుకుందని అధికారులు వెల్లడించారు.దేశ వ్యాప్తంగా కరోనా కేసులు దాదాపు 9వేలు నమోదు కాగా, కేవలం ఒక్క మహారాష్ట్రలోనే 2వేల పాజిటివ్ కేసులు రావడం తీవ్రతను తెలుపుతోంది. ప్రస్తుతానికి ఈ రాష్ట్రంలో కరోనా కేసులు 1,982 నమోదయ్యాయి. తాజా మరణాలు 22తో కలుపుకొని మొత్తం కరోనా రోగుల మరణాలు 149గా అధికారులు గుర్తించారు. Pics: ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos
కరోనా కేసులు భారత్‌లో నమోదవుతున్న సమయం నుంచి నేటి వరకూ మహారాష్ట్ర కోవిడ్19 పాజిటివ్ కేసులు, మరణాల్లో తొలి స్థానంలో ఉంది. చికిత్స అనంతరం కోలుకుని 217 మంది బాధితులు ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జ్ అయ్యారని రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. మురికివాడలతో పాటు జనసాంద్రత ఎక్కువగా ఉండే ముంబై లాంటి నగరాలలో కరోనా లాంటి ప్రాణాంతక వైరస్లు వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos