దేశ రాజధాని ఢిల్లీలో 'కరోనా వైరస్' ఉద్ధృతి తగ్గడం లేదు. రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా నిజాముద్దీన్ మర్కజ్ భవనం ప్రభావం ఎక్కువగా ఉంది. రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసుల్లో వారే ఎక్కువగా కనిపిస్తున్నారు.
ఈ రోజు ( బుధవారం) దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా 51 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 35 మంది విదేశాలకు వెళ్లి వచ్చిన వారుగా గుర్తించారు. మిగతా వారిలో నలుగురు మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్నవారు కాగా.. మిగిలిన వారిని ఇతరులుగా గుర్తించారు. నలుగురు మర్కజ్ నుంచి వచ్చిన వారిలో ఇద్దరు చనిపోయారు. మొత్తంగా ఇప్పటిి వరకు ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 576కు చేరుకుంది.
51 new #Coronavirus positive cases have been reported in Delhi today (including 35 with history of travel to a foreign country, 4 from Markaz and 2 deaths). The total number of positive cases in the union territory now stands at 576. pic.twitter.com/QMUJebu2M3
— ANI (@ANI) April 8, 2020
మరోవైపు ఢిల్లీలో కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని పోలీసులు సూచించారు. ఎవరైనా బయటకు వస్తే .. తిరిగి వారిని ఇళ్లకు పంపిస్తున్నారు. అత్యవసరాలు, నిత్యావసరాల కోసం బయటకు వచ్చిన వారిని కూడా సామాజిక దూరం పాటించాలని కోరుతున్నారు.
అటు ఢిల్లీ ముుఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ .. ఢిల్లీలోని రాజ్యసభ, లోక్ సభ ఎంపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిపై పరస్పరం చర్చించారు. లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేస్తున్నామని కేజ్రీవాల్ తెలిపారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..