'కరోనా వైరస్'పై అవగాహన కల్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ఎవరికి వారు తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే తెలుగు సినిమా అగ్రతారలు ఓ పాట విడుదల చేశారు. ఇప్పుడు అదే కోవలో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కూడా ముందుకు వచ్చారు.
స్టూడెంట్ నంబర్ 1 చిత్రంలో 'ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి..' పాట మీకు గుర్తుందా..? ఇప్పుడు అదే పాట బాణీకి పదాలు మార్చి కీరవాణి ఓ పాట సిద్ధం చేశారు. దీన్ని యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ పాటకు జనాదరణ బాగా పెరుగుతోంది. స్టే ఎట్ హోమ్ స్టే సేఫ్.. అంటూ నెటిజనులను అలరిస్తున్న పాటను మీరూ చూడండి...