Kushboo Prabhu: ప్రముఖ నటి కుష్బూ నటుడు ప్రభు చాలాకాలం పాటు ప్రేమలో ఉన్నారని.. వీరి ప్రేమ వ్యవహారం దాదాపు పెళ్లిదాకా వెళ్ళింది కానీ.. పెళ్లి పీటలు మాత్రం ఎక్కలేదు అని టాలీవుడ్ మీడియా ఎప్పటినుండో కోడై కూస్తూనే ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కుష్బూ దీని గురించి క్లారిటీ ఇచ్చారు.
ఒక నటిగా కుష్బూ గురించి తెలియని వారు ఉండరు అటు తమిళ్ ఇండస్ట్రీలో మాత్రమే కాక తెలుగు ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న నటి కుష్బూ. హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో తన సత్తా చాటిన కుష్బూ గత కొంతకాలంగా సపోర్టింగ్ క్యారెక్టర్లు కూడా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
హీరోయిన్ అన్నాక రూమర్లు చాలా కామన్. అలాగే హీరోయిన్గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తల్లోనే కుష్బూ మీద చాలా పుకార్లు వచ్చాయి. 1988లో పదహారేళ్ళ వయసులో కలియుగ పాండవులు అనే తెలుగు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన కుష్బూ కి తమిళ్లో మొదటి ఆఫర్ వచ్చింది మాత్రం జెమినీ గణేషన్ తనయుడు ప్రభు కారణంగానే. ఆయన రికమండేషన్ తోనే తమిళ్లో హీరోయిన్గా కుష్బూకి అవకాశం వచ్చింది.
కుష్బూ ప్రభువు కలిసి హీరో హీరోయిన్లుగా చిన్న తంబి అనే సినిమాలో నటించారు. 1991 లో విడుదలైన ఈ సినిమా తమిళ్లో బ్లాక్ బస్టర్ హీట్ అయింది. అయితే ఆ సినిమా షూటింగ్ సమయం నుంచే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది అంటూ పుకార్లు బయటకు వచ్చాయి. అప్పటికే ప్రభుకి పెళ్లి అయిపోయింది కానీ వీళ్ళిద్దరి ప్రేమ వ్యవహారం మాత్రం చాలా కాలం పాటు తమిళ్ న్యూస్ పేపర్లలో హెడ్ లైన్లు గా నిలిచింది.
దాదాపు పెళ్లి కూడా చేసుకుందామని అనుకుంటున్నా సమయంలో ప్రభు తండ్రి శివాజీ గణేషన్ దీనికి వీరి ప్రేమ వ్యవహారానికి అడ్డుకట్ట వేశారు. వీరి పెళ్లికి ఆయన ఒప్పుకోకపోవడంతో వీరి పెళ్లి ఆగిపోయింది. దీని గురించి చాలా కాలం ప్రభు లేదా కుష్బూ ఇద్దరూ ఎప్పుడూ రియాక్ట్ అవ్వలేదు. కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కుష్బూ దీని గురించి మాట్లాడారు.
అప్పట్లో ప్రభు కుష్బూ పెళ్లి చేసుకుంటున్నారు అని వార్తలు కూడా వినిపించాయి అని ప్రశ్న ఎదురవగా దానికి కుష్బూ వెంటనే "అది చాలా కాలం క్రితం కథ. ఇప్పుడు దాని గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఆయన బాగానే సెటిల్ అయ్యారు.. నేను బాగానే సెటిల్ అయ్యాను" అని అన్నారు కుష్బూ. ఆ తర్వాత కూడా మీ ఇద్దరూ కలిసి నటించారు కదా అని అడగగా.. దానికి "ఆయన నా హస్బెండ్ తో కూడా కలిసి నటించారు కదా" అని చెప్పుకొచ్చారు. కుష్బూ తమిళ్ యాక్టర్ డైరెక్టర్ సుందర్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.