Beer Supply Restoration In Telangana State: మందుబాబులకు భారీ శుభవార్త. నిలిపివేసిన బీర్ల సరఫరాను పునరుద్ధరణ చేశారు. బీర్ల సరఫరా నిలిపివేసిన కంపెనీలు తాజాగా వాటిని పునరుద్ధరణ చేస్తున్నట్లు ప్రకటించాయి. అత్యధికంగా అమ్ముడయ్యే కింగ్ ఫిషర్తోపాటు హైన్కెన్ బీర్ల సరఫరా నిలిపివేతపై కంపెనీలు వెనకడుగు వేశాయి.
తెలంగాణలో బీర్ల సరఫరాపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. మద్యం దుకాణాల్లో బీర్ల నిల్వ లేకపోవడంతో మందుప్రియులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో యునైటెడ్ బ్రూవరీస్ సంచలన నిర్ణయం తీసుకుంది.
మందుబాబులు ఆందోళన చెందుతున్న వేళ బీర్ల నిల్వలపై యుబీ సంస్థ స్పందించింది. బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ ప్రకటించింది.
బీర్ల సరఫరాపై ఆ కంపెనీ పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వంతో సంస్థ చర్చలు జరుపుతోంది. ప్రస్తుతానికి బీర్లను పునరుద్ధరించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన చేసింది.
బీర్ల కంపెనీలు వెనకడుగు వేయడంతో బీర్ల ధరల పెంపు, పాత బకాయిల విడుదలపై బేవరేజ్ కార్పొరేషన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. త్వరలోనే వీటిపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బీర్ల సరఫరా పునరుద్ధరణ చేస్తున్నట్లు యూబీ ప్రకటించింది.
వినియోగదారులు, కార్మికులు, వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా మధ్యంతర నిర్ణయం తీసుకున్నట్లు యూబీ సంస్థ తెలిపింది. కంపెనీ వెనకడుగు వేయడంతో తెలంగాణలో కొరతగా ఉన్న బీర్లు తిరిగి నిండుకోనున్నాయి.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు త్రైమాసికాలకు కలిపి దాదాపు రూ.900 కోట్లు రావాల్సి ఉండడంతో బీర్ల కంపెనీలు సరఫరా నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా సంస్థ వెనక్కి తీసుకోవడంతో బీర్ల సరఫరా యథావిధిగా జరగనుంది.