Kolkata Murder Case: నా కొడుకును అస్సలు వదలొద్దు.. ఆర్జీకర్ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంజయ్ రాయ్ తల్లి..

Rg kar murder case:  ఆర్జీకర్ జూనియర్ వైద్యురాలి అత్యాచార ఘటనపై నిందితుడు సంజయ్ రాయ్ తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో కోల్ కతా ఘటన దేశంలో మరోసారి వార్తలలో నిలిచింది.

1 /6

కోల్ కతా హత్యా చార ఘటన దేశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కోల్ కతాలో గతేడాది ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిని సెమినార్ లో అత్యాచారం చేసి, ఆతర్వాత హత్య చేశాడు. ఈ నేపథ్యంలో నిందితుడు సంజయ్ రాయ్ ను ఇటీవల కోల్ కతా కోర్టు దోషిగా తెల్చింది. 

2 /6

జూనియర్ వైద్యురాలి సెమినార్ హల్ లో ఒంటిపై దుస్తులు లేకుండా..అచేతనంగా ఉండటంను ఆస్పత్రి వర్గాలు గుర్తించారు. ఈ ఘటన దేశంలో దుమారంగా మారింది. దీనిపై నెలల తరబడి జూనియర్ వైద్యులు నిరసలు చేపట్టారు. అంతే కాకుండా.. దీనిపై కోల్ కతా హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది.

3 /6

ఘటన ప్రదేశంలో.. సంజయ్ రాయ్ ఇయర్ బడ్స్ దొరకడంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆర్జీకర్ ప్రిన్సిపాల్ సంజయ్ ఘోష్ ను అరెస్ట్ చేశారు. స్థానిక పోలీసు అధికారిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.

4 /6

జూనియర్ వైద్యురాలిని అత్యంత ఘోరంగా, అత్యాచారం చేసి.. ఆమె మెడ ఎముకలు, ప్రైవేటు భాగాలు డ్యామెజ్ అయ్యే విధంగా ఆమెను అత్యంత క్రూరంగా హతమార్చారని డాక్టర్ లు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వెల్లడించారు. ఈ ఘటనపై దేశ ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ములు కూడా స్పందించారు.  

5 /6

సంజయ్ రాయ్ శరీరం నుంచి తీసిన ఆనవాళ్లు.. ఘటన జరిగిన ప్రదేశంలో లభించిన ఆనవాళ్లతో సరిపోలాయి. ఈ క్రమంలో సీబీఐ కోల్ కతా కోర్టులో తన రిపోర్టును సబ్మిట్ చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల కోల్ కతా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.  సంజయ్ రాయ్ ను ఈ కేసులో నిందితుడిగా తెలుస్తు కోర్టు తీర్పు వెలువరించింది.   

6 /6

దీనిపై తాజాగా.. నిందితుడు సంజయ్ రాయ్ తల్లి స్పందించారు. తనకు ముగ్గురు ఆడబిడ్డలున్నారని.. తన కొడుకు ఇంతటి ఘోరం చేస్తాడని అనుకోలేదన్నారు. తన బిడ్డల్లాగే తాను కూడా అన్నారు. సంజయ్ రాయ్ ఇలాంటి పనిచేస్తాడని అనుకోలేదని.. అతడ్ని ఉరితీయాలని అన్నారు. అతగాడి సోదరి మాట్లాడుతూ.. దీనిపై తాము మరో కోర్టుకు వెళ్లే ఆలోచనలేదని స్పష్టం చేశారు. మరోవైపు కోల్ కతా కోర్టు నిందితుడు సంజయ్ రాయ్ కు సోమవారం  శిక్షను ఖరారు చేయనుంది. సంజయ్ రాయ్ తల్లి, సోదరి మాట్లాడిన మాటలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.