Saif ali khan: దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్ కు వైయస్ షర్మిలకు మధ్య ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోతాయి..

Saif Ali Khan Relation With YS Sharmila: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సైఫ్ అలీ ఖాన్ పై కొంత మంది ఆగంతకులు చేసిన దాడి సంచలనం రేపుతోంది.  అయితే సైఫ్ పై దాడి వెనక బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఉందనే వార్తలు వినిస్తున్నాయి. అప్పట్లో రాజస్థాన్ లో కృష్ణ జింకల వేటలో సల్మాన్ తో పాటు ఇతను ఉన్నాడు. అందులో భాగంగా చోటా నవాబ్.. అదేనండి సైఫ్ పై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఇతనికి వైయస్ షర్మిలకు ప్రత్యేకమైన బంధం ఉంది. ప్రస్తుతం ఆ రిలేషన్ చర్చనీయాంశంగా మారింది. 

1 /7

Saif Ali Khan Relation With YS Sharmila: సైఫ్ అలీ ఖాన్ పై అప్పట్లో  కృష్ణ జింకలను అన్యాయంగా వేటాడినందుకు ప్రతీకారంగా అతనిపై బిష్ణోయ్ గ్యాంగ్ కత్తితో దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. దీనిపై దర్యాప్తు జరగుతోతంది. సైఫ్ అలీ ఖాన్ కు తెలుగు సినిమాలతో మంచి అనుబంధమే ఉంది.

2 /7

ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’లో లంకేశుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ సినిమాలో భైరా అలియాస్ బైరవ పాత్రలో తారక్ ను ఢీ కొట్టే విలన్ పాత్రలో ఇరగదీసాడు. దీంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యాడు. ఇతనికి ఆంధ్ర ప్రదేశ్ దివంగత సీఎం ఫ్యామిలీ అయిన వైయస్ఆర్ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది.

3 /7

ఏంటి.. దేవర, ఆదిపురుష్  విలన్ సైఫ్ అలీ ఖాన్ ను వైయస్ఆర్ ఫ్యామిలీతో  అనుబంధమేమిటా  మైండ్ ఖరాబ్ చేసుకోంకండి.  అవును దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి  సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీకి చిత్రమైన సినీ అనుబంధమే ఉంది.

4 /7

సైఫ్ అలీ ఖాన్.. బాలీవుడ్ ఒకప్పటి టాప్ హీరోయిన్ షర్మిలా ఠాకూర్ కుమారుడు. ఈమె అప్పటి మన దేశ క్రికెట్ కు  కెప్టెన్ పనిచేసిన మన్సూర్ అలీ ఖాన్ ను ప్రేమించి మనువాడింది.  సైఫ్ అలీ ఖాన్ తల్లి షర్మిలా ఠాకూర్ ఒకప్పటి యువతకు కలల రాణి

5 /7

అంతేకాదు దివంగత ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ సీఎంగా పనిచేసిన వై.యస్.రాజశేఖర్ రెడ్డి .. షర్మిలా ఠాకూర్ కు వీరాభిమాని. అందుకే తనకు పుట్టిన కూతురుకు   తన ఫేవరేట్ హీరోయిన్ అయిన షర్మిల పేరు పెట్టుకున్నాడు. మన తెలుగు వాళ్లు అంతగా ఈ పేరు పెట్టుకోరు. ఉత్తరాది వాళ్లే పెట్టుకుంటారు. ఈ రకంగా దేవర విలన్ సైఫ్ కు వైయస్ఆర్ కు మధ్య ఉన్న చిత్రమైన అనుబంధం ఇదే.  

6 /7

షర్మిలా ఠాకూర్, పటౌడీల ఏకైక కుమారుడే సైఫ్ అలీ ఖాన్ విషయానికొస్తే... తండ్రి బాటలో క్రికెటర్ కాకుండా.. తల్లి బాటలో నటుడిగా మారారు. అంతేకాదు బాలీవుడ్ లో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ సెపరేట్ ఐడెండిటీ తెచ్చుకున్నాడు.

7 /7

సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ లో  టాప్ హీరోకు తక్కువ.. సైడ్ హీరోకు ఎక్కువ అన్నట్టు దాదాపు కెరీర్ లో  సెకండ్ హీరోగానే రాణించాడు.  ఇతను తొలిసారి  ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమాతో  లంకేశ్వరుడి పాత్రతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. కానీ ఈ సినిమా హిందీ,తెలుగులో తెరకెక్కింది. ఒక రకంగా ఆదిపురుష్ సైఫ్ కు తొలి తెలుగు సినిమా అని చెప్పాలి.