Hero Xoom 160 Maxi Scooter: హీరో మరో ప్రభంజనం.. చీప్ ధరకే మార్కెట్లోకి అద్భుతమైన స్కూటర్.. పూర్తి వివరాలు ఇవే..

Hero Xoom 160 Maxi Scooter: ప్రముఖ మోటార్ సైకిల్ కంపెనీ హీరో నుంచి మార్కెట్లోకి అద్భుతమైన స్కూటర్ లాంచ్ అయింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో పాటు ప్రత్యేకమైన స్టైలిష్ డిజైన్‌ను కలిగి ఉంది. అయితే ఈ స్కూటర్కు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Hero Xoom 160 Maxi Scooter 2025: ప్రముఖ మోటర్ సైకిల్ కంపెనీ హీరో తమ కస్టమర్స్‌కి గుడ్ న్యూస్ తెలిపింది. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న కొత్త స్కూటర్ జూమ్ 160 మ్యాక్సీ మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిని కంపెనీ శుక్రవారం గ్లోబల్ మొబిలిటీ ఎక్స్పోలో భాగంగా అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది అతి శక్తివంతమైన ఫీచర్స్ తో విడుదల అయినట్లు కంపెనీ వెల్లడించింది. అయితే ఈ స్కూటర్కు సంబంధించిన పూర్తి వివరాలు, ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకుందాం. 

1 /5

హీరో జూమ్ 160 మ్యాక్సీ స్కూటర్ మార్కెట్లోకి రూ. 1,48,500 (ఎక్స్-షోరూమ్) ధరతో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ స్కూటర్కు సంబంధించిన విక్రయాలు ఫిబ్రవరి నెల నుంచి ప్రారంభం కానన్నాయి. ఇక డెలివరీ మాత్రం హీరో కంపెనీ ఈ స్కూటర్ను మార్చి రెండో వారం లేదా మూడో వారం నుంచి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.     

2 /5

హీరో కంపెనీ ఈ స్కూటర్ను మొత్తం మూడు వేరియంట్లలో విడుదల చేసింది. ఇవి హీరో మోటోకార్ప్ ఎక్స్‌ట్రీమ్ 250ఆర్, ఎక్స్‌పల్స్ 210తో పాటు జూమ్ 125 వేరియన్స్‌లో లాంచ్ అయ్యాయి. ఈ మోటార్ సైకిల్ 156సీసీ, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ పై రన్ కాబోతున్నట్లు తెలుస్తోంది.   

3 /5

ఇక ఈ స్కూటర్కు సంబంధించిన ఇంజన్ పనితీరు వివరాల్లోకి వెళితే.. హీరో జూమ్ 160 14.8 హార్స్‌పవర్‌ను విడుదల చేస్తుంది. అంతేకాకుండా  14 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. అలాగే ఇది i3s సైలెంట్ స్టార్ట్, 4-వాల్వ్ టెక్నాలజీతో విడుదలైనట్లు కంపెనీ తెలిపింది. మార్కెట్లో దీని ధర 86,900 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం కాబోతోంది.   

4 /5

జూమ్ 160 స్కూటర్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇది బోల్డ్ డిజైన్‌లో హై స్టాన్స్, బ్లాక్-ప్యాటర్న్ టైర్‌లతో  విడుదలైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రత్యేకమైన డ్యూయల్-ఛాంబర్ LED హెడ్ లైట్స్, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ ఫీచర్స్ కూడా లభించనున్నాయి. ఇక దీనికి ప్రత్యేకమైన డిజిటల్ స్పీడోమీటర్ కూడా అందుబాటులో ఉండబోతోంది.    

5 /5

ఈ స్కూటర్ను హీరో కంపెనీ మొత్తం నాలుగు కలర్ ఆప్షన్స్‌తో విడుదల చేసింది. ఇందులోని ప్రత్యేకమైన కలర్ మాట్ రెయిన్‌ఫారెస్ట్ గ్రీన్ ఆకర్షణీయంగా నిలుస్తోంది. ఈ స్కూటర్ హీరో కంపెనీ గతంలో విడుదల చేసిన దానికంటే చాలా అద్భుతంగా ఉండబోతోంది. అంతేకాకుండా ప్రత్యేకమైన డిజైన్తో విడుదల విడుదలైనట్లు తెలుస్తోంది.