Suzuki Access 125 Electric: మారుతి సుజుకి Access Electric 125 స్కూటర్.. ఒకే ఒక్కసారి ఛార్జ్ పెడితే 100 కిలోమీటర్ల మైలేజీ..

Suzuki Access 125 Electric Scooter Price: త్వరలోనే మార్కెట్లోకి మారుతి సుజుకి యాక్సెస్ స్కూటర్ ఎలక్ట్రిక్ వేరియంట్ లో విడుదల కాబోతోంది. అయితే ఈ స్కూటర్ ఎలాంటి ఫీచర్స్ తో అందుబాటులోకి రాబోతుందో.. ఏయే వేరియంట్ లో విడుదలవుతుందో ఇప్పుడు తెలుసుకోండి.

Suzuki Access 125 Electric Scooter: ప్రముఖ మోటార్ సైకిల్ కంపెనీ సుజికి తమ కస్టమర్స్‌కి మరో గుడ్ న్యూస్ తెలుపబోతోంది. అతి త్వరలోనే యాక్సిస్ బైక్ సిరీస్‌ని ఎలక్ట్రిక్ వేరియంట్‌లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ బైకు సంబంధించిన కొన్ని ఫీచర్స్ లీకై సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నా. ఇండియా మొబిలిటీ ఎక్స్పోలో భాగంగా ఈ బైక్కు సంబంధించిన వివరాలను వెల్లడించే ఛాన్స్ కూడా ఉంది. అయితే ఈ బైక్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

1 /5

సుజుకి యాక్సెస్ ఎలక్ట్రిక్ 125 ICE (Suzuki Access Electric 125) స్కూటర్  అద్భుతమైన లుక్కులో అందుబాటులోకి రాబోతోంది. దీంతోపాటు ఎంతో శక్తివంతమైన బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ బైక్ లో ప్రత్యేకమైన పెట్రోల్ ట్యాంకును కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అంటే చార్జింగ్ అయిన వెంటనే పెట్రోల్‌తో నడిచే ప్రత్యేకమైన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానున్నారు.  

2 /5

ఈ Suzuki Access Electric 125 స్కూటర్ స్పెషల్ కలర్ ఆప్షన్స్‌తో విడుదల కాబోతోంది. ముఖ్యంగా ఇది డిజైన్ పరంగా చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ స్మార్ట్ స్కూటర్‌కు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన ఫొటోస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.     

3 /5

ఇక సుజుకి యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన వివరాల్లోకి వెళితే ఇది అద్భుతమైన బ్యాటరీ సెట్ అప్‌తో పాటు.. స్వింగ్‌ఆర్మ్-మౌంటెడ్ మోటార్‌ను కలిగి ఉండబోతుంది. దీనిని ఒక్కసారి చాట్ చేస్తే దాదాపు 100 కిలోమీటర్లకు పైగా మైలేజీని అందించే అవకాశాలు ఉన్నాయని లీకైన వివరాల్లో పేర్కొన్నారు.   

4 /5

ఈ Suzuki Access Electric 125 మోటార్ సైకిల్ రెండు నుంచి మూడు వేరియంట్లలో విడుదల కాబోతున్నట్లు సమాచారం. సుజుకి యాక్సెస్ ఎలక్ట్రిక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ ప్రత్యేకమైన సస్పెన్షన్తో విడుదల కాబోతోంది. అంతేకాకుండా దీని చక్రాలు 12-అంగుళాల ఉండబోతున్నట్లు లీకైన వివరాల్లో తెలిపారు. అలాగే ఇది ప్రత్యేకమైన డిస్క్ బ్రేక్లను కూడా కలిగి ఉంటుంది.     

5 /5

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ రైడర్‌ వంటి ఫీచర్లతో విడుదల కాబోతోంది. అంతేకాకుండా స్పెషల్ బ్లూటూత్ కనెక్టివిటీ.. అయితే ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ మార్కెట్లోకి విడుదలయితే త్వరలోనే లాంచ్ కాబోయే హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్తో పోటీపడే అవకాశాలు ఉన్నాయి.