Shani dev remedies: చాలా మంది శనీశ్వరుడి సాడేసాతి ప్రభావంతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు కొన్ని నియమాలను శనివారం రోజు పాటిస్తే.. గ్రహ దోషాలన్ని దూరమైపోతాయని పండితులు చెబుతున్నారు.
పుష్యమాసం శనీశ్వరుడికి ఇష్టమైన తిథిగా చెప్తుంటారు. ఈ మాసంలో శనీశ్వరుడి ప్రీతికొరకు చేసే పూజలు, వ్రతాలు మంచి ఫలితాలను ఇస్తాయని పండితులు చెబుతుంటారు. ప్రతి ఆదివారం కూడా సూర్యుడ్ని ఆరాధిస్తే.. గ్రహాదోషాలుండవని చెప్తుంటారు.
చాలా మంది ఏలినాటి, అర్ధష్టమ, సాడేసాతి ప్రభావంతో బాధపడుతుంటారు. జీవితంలో కష్టాలు ఎదురౌతున్నాయని బాధపడుతుంటారు. కానీ జీవితంలో మనం చేసుకున్న కర్మలను బట్టి మాత్రమే శనీశ్వరుడు ప్రభావం చూపిస్తాడు. అందుకే మంచి పనులు చేయాలని పండితులు చెబుతుంటారు.
పుష్య మాసంలో శనీశ్వరుడు కొన్ని రాశులకు ఉన్న ఫళంగా మంచి యోగాల్ని కల్గిస్తున్నాడు. దీని వల్ల జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకొవడంతో పాటు.. ఉద్యోగంలో ప్రమోషన్ లు కూడా పొందేందుకు అవకాశాలు ఉన్నాయని పండితులు సూచిస్తున్నారు.
తుల రాశి.. ఈ రాశి వారికి ముఖ్యంగా.. శనీశ్వుడి అనుగ్రహం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్లు సంభవించే అవకాశాలు కన్పిస్తున్నాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. విదేశీయానానికి అవకాశాలు పుష్కలంగా కన్పిస్తున్నాయి.
మకర రాశి.. ఈ రాశి వారికి కోర్టు కేసుల్లో ఉన్న ఇబ్బందులన్ని దూరమౌతాయి. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. భార్యతరపు ఆస్తులు మీ సొంతమౌతాయి. మీ వల్ల చాలా మంది భూముల కొనుగోలు అంశంలో లాభాలను అర్జిస్తారు.
మీన రాశి.. వీరికి రాజకీయ నేతలతో పరిచయాలు ఏర్పడుతాయి. రాదనుకుని వదిలేసిన డబ్బులు తిరిగి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లు, లాటరీలు తగిలే చాన్స్ లు పుష్కలంగా ఉన్నాయి. ఈ క్రమంలో శనీశ్వరుడి ఆశీర్వాదం మరింత పొందాలంటే.. నల్ల నువ్వులు, తైలాభిషేకం, నల్లని వస్త్రం శనిదేవుడికి సమర్పించాలని పండితులు చెబుతున్నారు. ( ఇది సోషల్ మీడియా కంటెంట్ ఆధారంగా రాయడం జరిగింది.. జీ మీడియా దీన్ని ధృవీకరించలేదు..)