న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా వణికొస్తోన్న కరోనా మహమ్మారి వ్యాప్తిని నివారించడంలో భాగంగా భారత ప్రధాని ఈ మేరకు జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. ఒక ప్రదేశంలో వైరస్ జీవిత కాలం మూడు గంటలుంటుందని, దీనికి గాను సమయం ఆదివారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు తమ ఇళ్లలోనే స్వయంగా Isolation పాటించాలని అన్నారు. మరోవైపు ఈ మహమ్మారి రాగిపై 4గం.లు, అట్టలపై 24గం.లు, స్టీల్‌పై రెండు నుంచి మూడు రోజులు ఉంటుందని, ఆ తర్వాత అది జీవించి ఉండదని అంటున్నారు శాస్త్రజ్ఞులు.
జనతా కర్ఫ్యూ 14 గంటలు ఉంటుంది కాబట్టి కరోనా సజీవంగా ఉన్న బహిరంగ ప్రదేశాలు 14 గం.ల తరువాత చాలా మేరకు కరోనా వైరస్ లేని ప్రాంతాలుగా మారతాయని ప్రధాని తన ప్రసంగంలో వ్యాఖ్యానించారు. మరోవైపు పూర్తిమొత్తంగా ఆ ప్రదేశాలు తాకినా కరోనా వైరస్ అంటుకోదని తద్వారా వైరస్ బారి నుండి కాలపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ అప్పటికే కరోనా సోకిన వారిని గుర్తించి ఏకాంత వైద్య శిబిరాలకు చేర్చవచ్చని, తగు ముందస్తూ జాగ్రత్తల ద్వారా కాపాడుకోవచ్చని పేర్కొంటున్నారు.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో దీని బారి నుండి ఎలా కాపాడుకొవాలనే అంశంపై పరిశోధనాలు వేగవంతమయ్యాయని ప్రధాని అన్నారు. మనం జనతా కర్ఫ్యూ పాటించడం ద్వారా వైరస్ బారి నుండి మనం కాపాడుకోవచ్చని, మిగిలిన దేశాలంతా వైరస్ బారిన పడకుండా క్షేమంగా ఉండవచ్చని ప్రధాని పేర్కొన్నారు.