Modi govt on 8 th pay commission: ప్రధాని మోదీ బడ్జెట్ కు ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పారు. 8వ వేతన సవరణ సంఘం ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దేశ ప్రధాని మోదీ మరో గుడ్ న్యూస్ చెప్పారు. గత కొన్ని నెలలుగా 8వ వేతన సవరణ సంఘం ఎప్పుడు ఏర్పడుతుందా అని సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో అలాంటి వారికి మోదీ సర్కారు సంక్రాంతి తర్వాత అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ గురువారం సమావేశమైంది. ఈ క్రమంలో పలు కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
దీనిలో ప్రధానంగా.. ఇస్రోలో మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దాదాపు రూ.3,985 కోట్ల వ్యయంతో మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
అంతే కాకుండా.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న 8వ వేతన సవరణ సంఘం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిపై ఇప్పటికే చైర్మన్ ను ఎవర్ని నియమించాలనే దానిపై అనేక కసరత్తులు కూడా స్టార్ట్ అయిపోయాయి.
దీనిపై త్వరలోనే.. వేతన సంఘం చైర్మన్‌ను వీలైనంత తొందరలోనే.. నియమించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. అంతే కాకుండా.. దీని సిఫారసుల్ని బడ్జెట్ లో కూడా చర్చిస్తారని తెలుస్తొంది.
మోదీ సర్కారు 8వ వేతన సవరణ సంఘం ఏర్పాటు ప్రకనటలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరొవైపు.. 7వ వేతన సవరణం సంఘం.. 2016 లో అమల్లోకి వచ్చింది. దీని గడువు... డిసెంబర్ 2025లో ముగియనుంది.
అయితే.. కేంద్ర ప్రభుత్వం ప్రతి పదేళ్లకు ఒకసారి వేతన సవరణ సంఘం ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం 53 శాతానికి చేరుకుంది. ఈ క్రమంలో ప్రస్తుతం 8వ వేతన సవరణ సంఘంపై గుడ్ న్యూస్ వెలువడటంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ఆనందంలో ఉన్నారు. ఈ వేతన సవరణ సంఘం ఇచ్చే సిఫారుల మేరకు జీత భత్యాలు పెరగటం ఆధారపడి ఉంటుంది.