కరోనా వైరస్ ఎఫెక్ట్ మందుబాబులపైనా పడింది. ఇప్పటికే కరోనా వైరస్ నేపథ్యంలో షాపింగ్ మాల్స్, థియేటర్లు, స్కూళ్లు, పార్కులు, పెద్ద పెద్ద హోటళ్లు.. ఇలా అన్ని మూతపడ్డాయి. ఐతే ఇప్పుడు ఈ ప్రభావం మందు బాబులపైనా పడింది. చాలా వరకు వైన్ షాపుల ముందు జనం లేకుండా పోయారు.
మరోవైపు ఆన్ లైన్ లో మద్యం విక్రయించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. కేరళలో ఓ వ్యక్తి హైకోర్టును కూడా ఆశ్రయించాడు. కానీ ఆన్ లైన్ మద్యం విక్రయాలపై విచారణ చేసిన కోర్టు.. పిటిషనర్ పై మండిపడింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం పేరుతో ఇలాంటి పిటిషన్ లు తీసుకురావద్దని ఆగ్రహించింది. అంతే కాదు కరోనా వైరస్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కోర్టులు పని చేస్తున్నాయి కదా న్యాయమూర్తి అన్నారు. మరోవైపు కేరళ, తమిళనాడులో వైన్ షాపుల వద్ద వింత పరిస్థితి కనిపిస్తోంది.
Read Also: 'కరోనా వైరస్' మంచే చేస్తోందా..?
కేరళలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ క్రమంలో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఐతే మందుబాబులు కూడా మద్యం కొనుగోలు కోసం వెళ్లలేని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో దుకాణాల యజమానులు తమ షాపుల ముందు కొత్త పద్ధతి ప్రవేశ పెట్టారు. దుకాణాల ముందు ముగ్గుతో గీతలు గీసి .. కొనుగోలుదారుల మధ్య కొంత గ్యాప్ ఉండేలా చూస్తున్నారు. అంతే కాదు మందుబాబులు సైతం ఆ పద్ధతిని చక్కగా అవలంభిస్తున్నారు.
Man... They have even started drawing lines to segregate and look at the discipline out there 😂😂#Corona #Kerala #Bevco pic.twitter.com/1gnY3SdxW2
— Forum Keralam (FK) (@Forumkeralam1) March 19, 2020
తమిళనాడులోనూ ఇలాంటి పరిస్థితి నెలకొంది. మందు బాబులు క్రమశిక్షణ కలిగిన పౌరులుగా మద్యం కొనుగోలు చేస్తున్నారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
The only place where social distancing is properly observed. #Tasmac #TamilNadu pic.twitter.com/QR7vM8YIyd
— Ethirajan Srinivasan (@Ethirajans) March 21, 2020