Saif Ali khan health bulletin: సైఫ్ అలీఖాన్ ఆరోగ్యంపై డాక్టర్లు తాజాగా, హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఆయన శరీరంపై ఉన్న కత్తిపోట్లు, వెన్నులో కత్తిగాయాలు మొదలైన అంశాలపై వైద్యులు పలు విషయాల్ని వెల్లడించారు.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ను గుర్తు తెలియని దొంగ నిన్న రాత్రి.. ముంబై బాంద్రాలోని ఆయన నివాసంలో ఇష్టమున్నట్లు కత్తితో దాడులకు పాల్పడ్డారు. దీంతో వెంటనే ఆయన కుటుంబ సభ్యులు ఆయనను లీలావని ఆస్పత్రికి తరలించారు.
రాత్రిపూట చోరీచేయడానికి వచ్చిన దొంగతో.. సైఫ్ కు మధ్య పెనుగులాట సంభవించింది. దీంతో అతగాడు.. కత్తితో మెడమీద, శరీర భాగాల మీద కత్తితో దాడిచేశారు. అరుపులతో ఇంట్లో వాళ్లు మెల్కొన్నారు.
ఘటన జరిగినప్పుడు.. ఇంట్లో పనివాళ్లు సైతం ఎవరు లేరు. మరీ ఇది ఎవరి పని.. కావాలని కుట్రకోణం ఉందా.. అన్న యాంగిల్ లో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదిలా ఉండగా.. సైఫ్ అలీఖాన్ శరీరంపై ఆరు కత్తిపోట్లను వైద్యులు గుర్తించారు. ఆయనకు అత్యవసరంగా సర్జరీలు చేశారు. అయితే.. ప్రస్తుతం ఆయనకు వెన్నెముక సర్జరీ అయినట్లు లీలావతి ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.
ఆయన ఆరోగ్యంపై తాజాగా.. హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. అంతే కాకుండా.. వెన్నెముకలో ఇరుక్కున్న కత్తిని తొలగించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ హెల్త్ నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. మెడకు, ఎడమ చెయ్యికి గాయాలయ్యాయని.. వాటిని ట్రీట్మెంట్ చేసినట్లు వైద్యులు తెలిపారు.
ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. సైఫ్ అలీఖాన్ ఇంటిలోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. అక్కడున్న సెక్యురిటీ సిబ్బందిని సైతం విచారిస్తున్నారు. వారి ఫోన్ లను ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ఘటన భాలీవుడ్ లో దుమారంగా మారింది. ఈ ఘటనపై మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. సైఫ్ తొందరగా కోలుకొవాలని కోరుకుంటూ ఎక్స్ వేదికంగా ట్విట్ చేశారు.