Agriculture Govt Job Recruitment: ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఎంపికైన అభ్యర్థులకు రూ.35 వేల జీతంతో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Agriculture Govt Job Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వ్యవసాయ శాఖలో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగాలకు భర్తీ చేయబోతున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ శాఖలో వివిధ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ లో భాగంగా అభ్యర్థులకు సంబంధించిన అర్హత పూర్తి వివరాలను క్లుప్తంగా పేర్కొంది. అర్హత కలిగిన విద్యార్థులకు ఇంటర్వ్యూ, జాబ్ ఎంపిక వివరాలను కూడా వెల్లడించింది. అయితే ఈ వ్యవసాయ శాఖకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం.
ఇక ఈ వ్యవసాయ శాఖకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాల్లోకి వెళితే.. ఈ నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి విడుదల చేసింది. మొత్తం ఈ శాఖలో ఖాళీగా ఉన్న మూడు విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు ప్రకటించింది.
ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ విడుదల చేసిన నోటిఫికేషన్లో ఫీల్డ్ అసిస్టెంట్‌తో పాటు ల్యాబ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, ట్రాక్టర్ డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు తెలిపింది. అయితే మొత్తం వీటి సంఖ్య పదిగా పేర్కొంది.
ఇక ఈ నోటిఫికేషన్ లో భాగంగా ట్రాక్టర్ డ్రైవర్ల సంఖ్య ఒకటి కాగా.. ఫీల్డ్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ల సంఖ్య 04గా ఉంది. ఇక టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య 05 ఉన్నట్లు తెలిపింది.
ఇక టెక్నికల్ అసిస్టెంట్ జాబ్ చేయాలనుకునేవారు తప్పకుండా కొన్ని అర్హతలు కలిగి ఉండాల్సి ఉంటుంది. అయితే ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీను సందర్శించాల్సి ఉంటుంది.
టెక్నికల్ అసిస్టెంట్ అర్హతల వివరాల్లోకి వెళితే.. ఈ జాబ్ అభ్యర్థులు తప్పకుండా అగ్రికల్చర్ బ్యాచిలర్ డిగ్రీలో 55% మార్కులతో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఫీల్డ్ అసిస్టెంట్లు డిగ్రీ లేదా పాలిటెక్నిక్ లో డిప్లమా చేసి ఉత్తీర్ణత సాధించి ఉండాలని నోటిఫికేషన్ లో వెల్లడించారు. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు జీతం రూ.35 వేల నుంచి ప్రారంభమవుతుంది.