Fatty Liver Problem: ఇటీవలి కాలంలో ఎదురయ్యే వివిధ రకాల అనారోగ్య సమస్యల్లో ప్రధానమైంది ఫ్యాటీ లివర్. చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవన విధానం, శారీరక శ్రమ లోపించడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వేగంగా వ్యాపిస్తోంది. లివర్‌లో అదనంగా కొవ్వు పేరుకున్నప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది.
ఈ పరిస్థితుల్లో లివర్ పనితీరు సరిగ్గా ఉండదు. సకాలంలో ఈ సమస్యకు చెక్ పెట్టకుంటే పరిస్థితి విషమిస్తుంది. ఇతర వ్యాధులకు కారణమౌతుంది. లివర్ సిరోసిస్, హెపటైటిస్ వంటి సమస్యలు రావచ్చు. అయితే మీ దినచర్యలో ఈ 5 మార్పులు చేస్తే ప్యాటీ లివర్ సమస్య నుంచి గట్టెక్కవచ్చు
షుగర్ తగ్గించడం ఉదయం వేళ షుగర్ ఉండే ఆహార పదార్ధాలు ఎక్కువగా తీసుకోకూడదు. ఇది ఫ్యాటీ లివర్ సమస్యను పెంచుతుంది. వైట్ బ్రెడ్, కేక్, స్వీట్స్‌కు దూరంగా ఉండాలి
ఫైబర్ బ్రేక్‌ఫాస్ట్ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. దీనికోసం దలియా, పండ్లు, నట్స్ మంచివి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. లివర్ ఫ్యాట్ సమస్య తగ్గుతుంది
తేలికపాటి యోగా లేదా వ్యాయామం ఉదయం వేళ యోగా లేదా తేలికపాటి వ్యాయామం చేయాలి. బరువు నియంత్రించుకోవాలి. లివర్‌లో పేరుకున్న అదనపు కొవ్వు తగ్గిస్తుంది. కొన్ని రకాల యోగాసనాలు అద్భుతంగా పనిచేస్తాయి.
టీ కాఫీలకు దూరం ఉదయం లేవగానే చాలామంది టీ కాఫీ తాగడం అలవాటు. దీనివల్ల ఇందులో ఉండే కెఫీన్ లివర్‌పై ప్రభావం చూపిస్తుంది. అందుకే టీ కాఫీ కాకుండా గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ తాగాలి. యాంటీ ఆక్సిడెంట్లతో పుష్కలంగా ఉంటుంది. లివర్ హెల్తీగా ఉంచుతుంది
రోజూ గోరు వెచ్చని నీరు తాగడం ఉదయం పరగడుపున గోరు వెచ్చని నీళ్లు తాగడం వల్ల శరీరంలోని విష పదార్ధాలు బయటకు పోతాయి. దాంతో లివర్ డీటాక్స్ అవుతుంది. జీర్ణక్రియ సైతం మెరుగుపడుతుంది. నీళ్లలో నిమ్మరసం, తేనె కూడా కలుపుకుని తీసుకోవచ్చు. లివర్‌లో ఉండే అదనపు కొవ్వు తగ్గించవచ్చు