Actress: రాజకీయాల్లోకి ప్రవేశించనున్న తెలుగు స్టార్ హీరోయిన్..!

Actress Political Entry: సినీ నటులు రాజకీయాల్లోకి రావడం కొత్త కాదు. అప్పటి సీనియర్ ఎన్టీఆర్ నుంచి ఇప్పటి పవన్ కళ్యాణ్ వరకు.. ఎంతోమంది సెలబ్రెటీస్ రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ సాధించారు. ఈ క్రమంలో ఇప్పుడు ఒక హీరోయిన్ సైతం త్వరలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇంతకీ ఆ నటి ఎవరు అనే విశేషాలకు వెళితే..

1 /5

శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ గురించి సౌత్ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తమిళనాడు సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ప్రారంభమైన వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi Sarath Kumar) ప్రయాణం, తెలుగులో కూడా విశేష గుర్తింపు పొందింది. అంతేకాదు ఎంతోమంది.. ఆమెను జూనియర్ రమ్యకృష్ణగా పిలుస్తారు. రమ్యకృష్ణ లాగే, హీరోయిన్‌గా.. అలానే విలన్ పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించే నటనతో ఆమె గుర్తింపు పొందింది.  

2 /5

గత రెండేళ్లుగా వరలక్ష్మి నటించిన చిత్రాలు దాదాపు అన్ని విజయవంతమవుతున్నాయి. మదగజరాజా వంటి చిత్రాలతో ఆమె ప్రజాదరణను మరింత పెంచుకుంది. ఈ చిత్రం 12 ఏళ్ల తర్వాత విడుదలైనప్పటికీ, ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే, వరలక్ష్మి "హనుమాన్" సినిమాలో తన పాత్రతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగింది.  ముఖ్యంగా బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రంలో అద్భుతంగా నటించి ప్రశంసలు తెచ్చుకుంది.

3 /5

తాజాగా మదగజరాజా ప్రమోషన్ల సందర్భంగా మీడియాతో మాట్లాడిన వరలక్ష్మి, రాజకీయాల్లోకి వస్తానని స్పష్టం చేసింది. అయితే, ఇప్పటికి అది కొంత సమయం పడుతుందని చెప్పింది. తన స్ఫూర్తి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత అని, ఆమె చూపించిన మార్గంలోనే రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని తెలిపింది.  సోషల్ మీడియాలో తనపై వస్తున్న నెగటివ్ ట్రోలింగ్‌పై కూడా ఆమె ఘాటుగా స్పందించింది. విమానాశ్రయంలో ఫోటో తీసుకునే సమయంలో జరిగిన ఒక సంఘటనను ఉదహరించి, తన వ్యక్తిగత నిర్ణయాలను గౌరవించాలని సూచించింది. 

4 /5

“నేను ఒకసారి విమానాశ్రయంలో.. అత్యవసర పనిమీద వెళుతుండగా.. కొంతమంది వచ్చి నాతో ఫోటోలను తీసుకున్నారు. కానీ అప్పుడు ఒకటను మాత్రం.. వచ్చి ఫోటో తీసుకుంటానని అడగ్గా.. నాకు అప్పటికే సమయం మించి పోవడంతో నేను వద్దని చెప్పాను. దీంతో అతను వెంటనే ఫోటో తీసుకోనివ్వరా? మరి ఎందుకు మీరు నటనలోకి వచ్చారు? అని మాట్లాడసాగారు. అలాంటి వారికి బుద్ధి లేదు నేను బదులివ్వాల్సిన అవసరం అంతకంటే లేదు,” అంటూ చెప్పుకొచ్చి వరలక్ష్మీ శరత్ కుమార్. ఇక ఈ ట్రోలింగ్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.  

5 /5

ఇక ఈ క్రమంలో ఈ హీరోయిన్ తన రాజకీయ ఎంట్రీ గురించి..ఇచ్చిన స్టేట్మెంట్..ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటోంది. మరి త్వరలోనే ఏ పార్టీ ద్వారా ఈ నటి రాజకీయాల్లోకి వస్తుందో వేచి చూడాలి.