Daaku Maharaaj 2nd Day Collection: రెండో రోజు ‘డాకు మహారాజ్’ అరాచకం.. బాక్సాఫీస్ దగ్గర బాలయ్య దబ్బిడి దిబ్బిడే.

Daaku Maharaaj Collection: నందమూరి బాలకృష్ణ  హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. సంక్రాంతి బరిలో విడుదలైన   కథానాయికుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. పొంగల్ సీజన్ లో విడుదలైన బాలయ్య 23వ సినిమా. మొదటి రోజే హిట్ టాక్ తో మొదలైన ఈ సినిమా ఫస్ట్ డే బిగ్గెస్ట్  కలెక్షన్స్ సాధించింది. రెండో రోజు కూడా అదే జోరు కొనసాగించినట్టు బుకింగ్స్ జోరు చూస్తుంటే తెలుస్తోంది.

1 /6

Daaku Maharaaj Collection: బాలయ్యకు సంక్రాంతి హీరో అనే పేరు ఉంది. ఈ సీజన్ లో బాలయ్యకు 23వ సినిమా ‘డాకు మహారాజ్’. సోలో హీరోగా 19వ చిత్రం. తండ్రితో కలిసి ‘వేములవాడ భీమకవి’, ‘దాన వీర శూర కర్ణ’, ‘అనురాగ దేవత’ సినిమాలు సంక్రాంతికి విడుదలయ్యాయి. సోలో హీరోగా ‘ఆత్మ బలం’ సినిమా 1985 సంక్రాంతికి విడుదలైంది. అప్పటి నుంచి 2025 వరకు వరుసగా 40 యేళ్లుగా సంక్రాంతిబరిలో బాలయ్య చిత్రాలు విడుదలవుతూనే ఉన్నాయి.

2 /6

 ఈ చిత్రాన్ని  సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్, శ్రీకర ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కించారు. బాబీ కొల్లి దర్శకత్వం వహించారు.  ఈ సినిమా తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 25.72 కోట్ల షేర్.. ప్రపంచ వ్యాప్తంగా.. రూ. 32.85 కోట్ల షేర్ (రూ. 56 కోట్ల గ్రాస్) వసూళ్లు రాబట్టినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

3 /6

ఇప్పటికే మొత్తం బిజినెస్ లో దాదాపు 40 శాతం వసూళ్లను తొలి రోజే రాబట్టింది. మరోవైపు ఓవర్సీస్ లో 1 మిలియన్ యూఎస్ డాలర్స్ ప్రీమియర్స్ తో పాటు తొలి రోజు వసూల్లతో రాబట్టింది.

4 /6

అంతేకాదు వరుసగా హాట్రిక్ హిట్స్ తర్వాత బాలయ్య నుంచి వచ్చిన  చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా అందుకోని డబుల్ హాట్రిక్ కు తెర లేపారు బాలయ్య. సీనియర్ హీరోల్లో వరుసగా నాలుగు హిట్స్ అది కూడా 60 ప్లస్ ఏజ్ లో అందుకున్న సీనియర్ హీరోలు తెలుగు సహా భారతీయ చిత్ర పరిశ్రమలో ఎవరు లేరు. 

5 /6

ఈ సినిమా రెండో రోజు కూడా అదే జోరు కనబరిచినట్టు బుకింగ్స్ చూస్తే తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు దాదాపు రూ. 15 కోట్ల నుంచి రూ. 20 కోట్ల మధ్య షేర్ రాబట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా రూ. 25 కోట్ల మధ్య వచ్చే అవకాశాలు ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. దాదాపు రెండు రోజుల వసూల్లతో దాదాపు 70 శాతం బిజినెస్ రికవరీ కానుంది.

6 /6

‘డాకు మహారాజ్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా చేసిన  ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ కలిపి రూ.67.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.ఓవర్సీస్.. రూ. 8 కోట్లు.. కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి..రూ. 5.40 కోట్లు.. మొత్తంగా రూ. 80.70 కోట్లు బిజినెస్ చేసింది. ఇప్పటి వరకు బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ అని చెప్పాలి. రూ. 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగింది. రెండు రోజుల వసూల్లతో ‘డాకు మహారాజ్’ సినిమా రెండు రోజుల్లో రూ. 50 కోట్ల షేర్ (రూ. 100 కోట్ల ) గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశాలున్నాయి.