Gold Rate Today: పండగపూట పసిడి ప్రియులకు భారీ షాక్.. భారీగా పెరిగిన బంగారం... త్వరలోనే లక్ష దాటడం ఖాయం

Gold Rate Today: దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి గోల్డ్ రేట్స్ వరుసగా పెరుగుతున్నాయి. తాజాగా బంగారం ధరరూ. 81వేల రూపాయలు దాటడంతో పసిడి ప్రియుల్లో ఆందోళన మొదలైంది. కాగా నేడు జనవరి 13వ  తేదీ సోమవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 
 

1 /6

బంగారం ధర జనవరి 13వ తేదీ సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరరూ. 81,000గా ఉంది. ఇక అటు  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,900గా ఉంది.   

2 /6

బంగారం ధరలు పెరగడానికి కారణాలెన్నో ఉన్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయంగా నెలకున్న ఆర్థిక పరిస్థితులే ఇందుకు కారణమని కూడా చెప్పవచ్చు. ప్రధానంగా అమెరికా వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలో జరిగే మార్పులు బంగారం ధరలను నిర్ణయిస్తుంటాయి.   

3 /6

అమెరికాలో ఒక ఔన్సు బంగారం ధర 2700 డాలర్లను దాటేసింది. పసిడి ధరలు దేశీయంగా పెరగడానికి పెద్ద కారణమే ఉందని చెప్పవచ్చు. ఇదెలా ఉంటే ఈ నెల చివరిలో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవి బాధ్యతలు చేపడతారు.  ఈ  ఈవెంట్ కూడా బంగారం ధరలు  ప్రభావితం చేసే ఛాన్స్ ఉంటుంది.   

4 /6

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టకముందే వివాదాస్పద వ్యాఖ్యలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా ట్రంప్ తాజాగా డెన్మార్క్ ఆదీనంలోని గ్రీన్ ల్యాడ్ ద్వీపాన్ని కొనుగోలు చేస్తామంటూ ఓపెన్ ఆఫర్ ప్రకటించారు.   

5 /6

తమ పొరుగు దేశం కెనడాను కూడా తమ ఆధీనంలోకి 51వ రాష్ట్రంగా విలీనం చేసుకుంటామని ప్రతిపాదించారు. ఈ పరిణామాలన్నీ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో పెట్టుబడి దారులు సెంటిమెంట్ కూడా దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది.   

6 /6

అటు అంతర్జాతీయంగా నెలకున్న పరిస్థితులతోపాటు దేశీయంగా కూడా బంగారం డిమాండ్ స్వల్పంగా పెరుగుతుంది. ఇది కూడా బంగారం ధరలను పెంచేందుకు దోహదం చేస్తుంది. అయితే బంగారం ధర గత ఏడాది నవంబర్ నెలలో 84 వేల రూపాయల వద్ద ఆల్ టైం రికార్డ్ ను క్రియేట్ చేసింది. ప్రస్తుతం 81వేల రూపాయల దగ్గర ఉంది. త్వరలోనే రికార్డును దాటే ఛాన్స్ ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.