BSNL 84 Dats validity Plan: బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కస్టమర్లకు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్స్‌తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా 84 రోజుల వాలిడిటీ ప్లాన్ తో డేటా ఫ్రీ, అపరిమిత వాయిస్ కాలింగ్ తీసుకువచ్చింది. ప్రభుత్వ రంగ బిఎస్ఎన్ఎల్ కంపెనీకి మిలియన్ల కొద్ది కస్టమర్లతో, అద్భుతమైన ప్లాన్స్ అందిస్తోంది.. అయితే బిఎస్ఎన్ఎల్ మరో రెండు ప్లాన్లను అతి తక్కువ ధరలోనే పరిచయం చేసింది. 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ వివరాలు తెలుసుకుందాం
బిఎస్ఎన్ఎల్ ఇప్పటికే ఎన్నో బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్లను కస్టమర్లకు అందిస్తుంది. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్, డేటా అందిస్తోంది. అయితే బిఎస్ఎన్ఎల్ రూ. 215 , రూ. 628 ప్లాన్స్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఇది ఒకటి షార్ట్ టర్మ్, మరొకటి లాంగ్ టర్మ్ వ్యాలిడిటీ ప్లాన్. ఈ ప్లాన్స్‌కు ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు.
బిఎస్ఎన్ఎల్ రూ.628 ప్లాన్.. ఈ ప్లాన్ లాంగ్ టైం ప్లాన్. ఎక్కువ రోజులు ప్లాన్ పొందాలనుకునేవారికి ఎంతో ఉపయోగకరం. రూ. 628 రీఛార్జీ చేస్తే 84 రోజుల వ్యాలిడిటీ పొందుతారు.. ఇందులో కస్టమర్లకు అదనపు లాభం ఏంటంటే ట్రావెలింగ్ చేసేవాళ్ళు నేషనల్ రోమింగ్ కూడా ఉచితంగా పొందుతారు. దీంతో మీరు ఏ ఖర్చు పెట్టకుండానే ఉచితంగా 4 జి డేటా అందుకుంటారు.
ఈ ప్లాన్‌తో బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లు రీఛార్జీ చేసుకుంటే 84 రోజులపాటు 252 జిబి డేటా అందుతుంది. ఇది కాకుండా మ్యూజిక్ గేమ్స్ హర్డీ గేమ్స్, ఛాలెంజర్ అరేనా గేమ్స్ ఉచితంగా యాక్సెస్ పొందుతారు
బిఎస్ఎన్ఎల్ రూ.215 ప్లాన్.. ఇది షార్ట్ అండ్ వ్యాలిడిటీ ప్లాన్. కేవలం రూ.215తో మీరు ఏ నెట్వర్క్ అయినా 30 రోజులపాటు అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఇందులో మీకు 2 జిబి డేటా హై స్పీడ్ అందుతుంది. మొత్తంగా 60 జిబి డేటా పొందుతారు ఇది కాకుండా ఎస్ఎంఎస్ లో ఉచితంగా పొందుతారు.. ఈ కొత్త బిఎస్ఎన్ఎల్ ప్లాన్ తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది
బీఎస్‌ఎన్‌ఎల్ త్వరలో 5 జీ సేవలను అందించనున్నట్లు ప్రకటించింది. పెరిగిన టెలికాం ధరల తర్వాత లక్షల మంది మొబైల్ యూజర్లకు బాసటగా నిలుస్తోంది. ఎందుకంటే ఈ ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ ధరలు అతి తక్కువలో అందుబాటులో ఉంటాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు.