Mazaka Movie Teaser: మజాకా రిలీజ్ ఈవెంట్‌లో షాకింగ్.. అల్లు అర్జున్ గొడవను మళ్లీ తెరపైకి లాగిన డైరెక్టర్..?.. వీడియో వైరల్..

Mazaka movie director trinadha rao: మజాక మూవీ టీజర్ విడుదల కార్యక్రమంలో డైరెక్టర్ త్రినాధ రావు అల్లుఅర్జున్ ను ఇమిటేట్ చేశారు. దీంతో బన్నీ ఘటన మరోసారి వార్తలలో నిలిచింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Jan 12, 2025, 10:55 PM IST
  • బన్నిని మధ్యలోకి లాగిన డైరెక్టర్..
  • రచ్చగా మారిన మజాకా రిలీజ్ ఈవెంట్..
Mazaka Movie Teaser: మజాకా రిలీజ్ ఈవెంట్‌లో షాకింగ్.. అల్లు అర్జున్ గొడవను మళ్లీ తెరపైకి లాగిన డైరెక్టర్..?.. వీడియో వైరల్..

Director trinadha rao imitates allu arjun goes controversy: మజాకా మూవీ టీజర్ ఈవెంట్ లో డైరెక్టర్ త్రినాధ రావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వివాదస్పదంగా మారాయి. దీనిపై మళ్లీ బన్నీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. డైరెక్టర్ త్రినాధ రావు.. స్టేజీ మీద  మజాకా టీజర్ ఈవెంట్ లో మాట్లాడారు.ఆ సమయంలో ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న రీతువర్మను పేరును మర్చిపోయినట్లు.. నీళ్లు అడుగుతూ..ప్రవర్తిస్తారు. ఆ తర్వాత మళ్లీ.. రీతు వర్మ అంటూ ఫన్నీగా నవ్వేశారు.

 

అయితే.. గతంలో అల్లు అర్జున్ పుష్ప 2 ఈవెంట్ లో సీఎం రేవంత్ రెడ్డి పేరు గుర్తుకు రాక.. నీళ్లు ఇవ్వమని.. గొంతు తడారి పోయిందని కూడా ఆయన మాట్లాడటం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆతర్వాత అనుకొని విధంగా పుష్ప2 ప్రీమియర్ షో నేపథ్యంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. దీనిలో రేవతి అనే మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అయితే.. ఈ ఘటనలో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేయడం, అనేక నాటకీయ పరిణామాలు జరగడం మనకు తెలిసిందే.

అల్లు అర్జున్ సీఎం రేవంత్ పేరును స్టేజీ మీద మర్చిపొవడం వల్ల.. సీఎం రేవంత్ బన్నీకి చుక్కలు చూపించారని ప్రచారం జరిగింది. అయితే..ఇదంత ఇప్పుడు కూల్ గా అయిపోయింది. బన్నీకి రెగ్యులర్ బెయిల్ తో పాటు... నాంపల్లి కోర్టు ఇటీవల కొన్ని కండీషన్ లను కూడా సడలించింది. ఇలాంటి సమయంలో ఈ డైరెక్టర్ తన మూవీ టీజర్ లో బన్నీలాగా ఇన్ డైరెక్ట్ గా ఇమిటేట్ చేయడం..ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

Read more: Mazaka Teaser Video: అవన్ని పెద్ద సైజుల్లో ఉండాలి.. హీరోయిన్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్.. వీడియో ఇదే..

దేశాన్నిషాకింగ్ కు గురిచేసిన ఘటనను.. ఫన్నీగా ఎలా చేశావని కూడా.. బన్నీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అంటే.. సీఎం రేవంత్ ను ఇమిటేట్ చేశావా.. లేదా బన్నీని మళ్లీ రెచ్చగొడుతున్నావా.. అంటూ సోషల్ మీడియాలో డైరెక్టర్ ను తిట్టిపొస్తున్నారంట.  అంతకు ముందు ఈయన హీరోయిన్లకు.. అవన్ని పెద్ద సైజులో ఉండాలని.. బాడీ షెమింగ్ గురించి మన్మథుడు ఫెమ్ అన్షు గురించి మాట్లాడారు. దీనిపైన నెటిజన్లు మండిపడుతున్నారు. మొత్తానికి మజాకా.. మూవీ మాత్రం.. ఈ డైరెక్టర్ వ్యాఖ్యల వల్ల ఒక్కసారిగా ట్రెండింగ్ గా మారింది. 
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News