Kalki World Television premier: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యాక్ట్ చేసిన చిత్రం ‘కల్కి 2898 ఏడి’. ఈ మూవీ గతేడాది విడుదలైన దాదాపు రూ. 1100 కోట్లకు పైగా వసూళు చేసి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఎపుడో థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా జీ తెలుగులో ఈ రోజు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా రాబోతుంది.
Kalki World Television premier: కంటెంట్ ఉంటే అన్ సీజన్ అయినా.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్లను రాబట్టవచ్చని‘కల్కి’ మూవీతో మరోసారి ప్రూవ్ అయింది. ఈ సినిమా విడుదలైన దాదాపు అన్ని ఏరియాల్లో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తుంది. కల్కి మేనియా తెలుగు చిత్ర సీమకే పరిమితం కాలేదు. నార్త్ బెల్ట్ లో ఈ సినిమా సంచలనం క్రియేట్ చేసింది.
తాజాగా ఈ సినిమా ఆరు నెలల తర్వాత జీ తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా రాబోతుంది. అది కూడా ఈ రోజు సాయంత్రి 5.30 గంటలకు ప్రసారం కానుంది. మొత్తంగా థియేట్రికల్ గా.. ఓటీటీ వేదికగా బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కల్కి ’ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.
కల్కి సినిమా హిందీ వెర్షన్ లో దాదాపు రూ. 300 కోట్ల నెట్ (రూ. 450 కోట్ల గ్రాస్) బాక్సాఫీస్ వసూళ్లను రాబట్టినట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి. కల్కి సినిమా తెలంగాణ ఏరియాలో రూ. 100 కోట్ల షేర్ (రూ. 185 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తంగా తెలంగాణలో రూ. 65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను గాను రూ. 35 కోట్ల వరకు బయ్యర్స్ కు లాభాలను తీసుకొచ్చింది.
మొత్తం అన్ సీజన్ లో అది కూడా ఎలాంటి హాలీడేస్ లేకుండా విడుదలైన ‘కల్కి 2898 AD’ మూవీ తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 168 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 215 కోట్లకు పైగా షేర్ అందుకుంది. మరోవైపు ఈ సినిమా $ 20 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసింది. ఓవరాల్ ఈ చిత్రం మన కరెన్సీలో రూ. 140 కోట్ల షేర్ (రూ. 280 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. అంతేకాదు బాహుబలి 2 తర్వాత ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత పుష్ప 2 ఈ సినిమా రికార్డును బ్రేక్ చేసింది.
ఓవరాల్ గా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1200 కోట్ల గ్రాస్ (రూ. 582 కోట్ల షేర్) రాబట్టినట్టు మూవీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవరాల్ గా ఈ సినిమా థియేట్రికల్ గా ఈ సినిమా రూ. 180 కోట్ల లాభాలను ఆర్జించినట్టు ఈ మూవీ మేకర్స్ తెలియజేసారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.