YS Abhishek Reddy: తమ్ముడిని చూసి మాజీ సీఎం జగన్ భావోద్వేగం.. విషాద వదనంతో నివాళి

YS Jagan Emotional After Tributes To YS Abhishek Reddy: అనారోగ్యంతో మృతి చెందిన తన సోదరుడు వైఎస్‌ అభిషేక్‌ రెడ్డికి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నివాళులర్పించారు. కడప జిల్లా పులివెందులలో అభిషేక్‌ రెడ్డి అంత్యక్రియల్లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ దంపతులు హాజరై భావోద్వేగానికి లోనయ్యారు.

1 /6

వైఎస్‌ కుటుంబంలో ఇటీవల తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సోదరుడు హఠాన్మరణం పొందడంతో వైఎస్‌ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది.

2 /6

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్‌లో ఈనెల 7వ తేదీన మృతిచెందిన అభిషేక్‌ రెడ్డి అంత్యక్రియలు కడప జిల్లా పులివెందులలో నిర్వహించారు.

3 /6

వైఎస్ ప్రకాశ్‌ రెడ్డి మనుమడు వైఎస్ అభిషేక్ రెడ్డి జగన్‌కు సోదరుడి వరుస అవుతాడు. అతడి మృతితో జగన్‌ పులివెందులకు చేరుకున్నారు. 

4 /6

తన సతీమణి వైఎస్‌ భారతితో కలిసి అభిషేక్‌ రెడ్డి అంత్యక్రియల్లో జగన్‌ పాల్గొన్నారు. పుష్పాంజలి ఘటించిన అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.

5 /6

వైఎస్‌ అభిషేక్‌ రెడ్డి కుటుంబపరంగానే కాకుండా రాజకీయాల్లో జగన్‌కు సహకారంగా ఉన్నాడు. వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వైద్య విభాగ రాష్ట్ర కార్యదర్శిగా వైఎస్ అభిషేక్ రెడ్డి బాధ్యతలు నెరవేర్చిన విషయం తెలిసిందే.

6 /6

గతేడాది జరిగిన ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో కడప జిల్లా లింగాల మండల ఇన్‌చార్జిగా అభిషేక్‌ రెడ్డి వైఎస్సార్‌సీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. అతడి మృతితో వైఎస్‌ కుటుంబంతోపాటు వైఎస్సార్‌సీపీలోనూ తీవ్ర విషాదం అలుముకుంది. అంత్యక్రియల్లో వైసీపీ శ్రేణులు కూడా భారీగా పాల్గొన్నాయి.