TOMCOM: నిరుద్యోగులకు బంపర్ గుడ్ న్యూస్.. పది చదివినవారికి జర్మనీలో ఉద్యోగం, 2,18,000 జీతం..

TOMCOM Germany Job: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) టామ్ కామ్ జర్మనీలో డ్రైవర్ జాబ్ పోస్టుల భర్తీకి అప్లికేష్స్ స్వీకరిస్తుంది. బస్సు డ్రైవర్ పోస్టుల భర్తీ చేపట్టింది. దీనికి కేవలం పదో తరగతి పూర్తి చేసి ఉంటే చాలు, లక్షల్లో జీతం పొందుతారు.
 

1 /5

తెలంగాణ గవర్నమెంట్ రిజిస్టర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ, ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ నైపుణ్యత కలిగిన డ్రైవర్ల కోసం అప్లికేషన్ పోస్టుల భర్తీ చేయనుంది. ఇందులో ఎక్కువ మొత్తంలో శాలరీలు కూడా అందుకుంటారు. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది సువర్ణావకాశం.  

2 /5

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి కనీసం  పూర్తి చేసుకోవాలి. హెవీ మోటర్ వెహికల్ లైసెన్స్ రెండు సంవత్సరాల ముందు లైసెన్స్‌ కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 24 నుంచి 40 మధ్య వయసు కలిగి ఉండాలి. అంతేకాదు A2 స్థాయిలో జర్మన్ లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలి.  

3 /5

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎంపికైతే ప్రతి నెల రెండు లక్షల 18 వేల జీతం అందిస్తారు.  అంతే కాదు జర్మనీలో ప్రొఫెషనల్ ఎన్విరాన్ మెంట్లో భద్రమైన జాబ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. కేవలం పదో తరగతి అర్హతతో విదేశాల్లో లక్షల్లో సంపాదించే జీతం మీ సొంతం.   

4 /5

ఈ జర్మనీ బస్సు డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు www. TOMCOM.Telangana.gov.in   లేదా 9440052592 ,8125251408, 9440049013  కాల్ చేసి ఇతర వివరాలు తెలుసుకోవచ్చు.  

5 /5

ఇక టామ్‌కామ్‌ నర్సులు సంబంధించిన ప్రత్యేక ప్రోగ్రామ్లను నిర్వహిస్తుంది. జర్మన్ లాంగ్వేజెస్ లో నైపుణ్యత శిక్షణ అందిస్తుంది. ఈ కోర్సు పూర్తి చేసి దరఖాస్తు చేసుకుంటే జర్మనీలో సులభంగా జాబ్ పొందవచ్చు.  ఈ కోర్స్ ఆన్లైన్, ఆఫ్ లైన్ రెండు విధాలుగా నిర్వహిస్తుంది. B2 లెవెల్ వరకు ట్రైనింగ్  ఆన్లైన్లో అందించనున్నారు.