AP TS Cold Wave: తెలుగు రాష్ట్రాలను వణికిస్తూన్న చలి.. సంక్రాంతి వరకు అంతే..

AP TS Cold Wave: తెలుగు రాష్ట్రాల ప్రజలను చలి వణికికొస్తోం. అంతేకాదు చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. గత నెలరోజుల నుంచి తగ్గుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం ఇంకా పడిపోతున్నాయి. ఈ ఏడాది గతం కంటే దారుణంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి పెరిగిపోయింది.

1 /7

AP TS Cold Wave: తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలితో ఏజెన్సీలో ప్రజలు వణుకుతున్నారు. సాయంత్రం నుంచే చలిగాలులు వీస్తున్నాయి. పొగమంచు దట్టంగా కురుస్తోంది. రాత్రి సమయంలో చలిప్రభావం మరింత అధికంగా ఉంటుంది.

2 /7

చలి కారణంగా పొగ మంచుతో ఉదయం పూట దారులు కనపటడం లేదు. దీంతో పలు చోట్ల వాహన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఏపీలో విశాఖ ఏజెన్సీతోపాటు రాయలసీమ రీజియన్‌లోనూ చాలాచోట్ల 12 నుంచి 20 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి.

3 /7

గతం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత  మరింత పెరిగింది. రాత్రి సమయాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సైతం 30 డిగ్రీలకు మించడం లేదు.

4 /7

అటు అరకులోయలో 8.2 డిగ్రీలు, జి.మాడుగుల 9, డుంబ్రిగుడ 9.2, అనంతగిరి 9.5, జీకే వీధి 9.8, పాడేరు మండలం మినుములూరు 10, హుకుంపేట 10.5, చింతపల్లి 10.6, కొయ్యూరు 13.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

5 /7

మరోవైపు తెలంగాణలోనూ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణ ఆదిలాబాద్‌లో కనిష్ఠంగా 8.2 డిగ్రీల ఉష్టోగ్రత నమోదైంది. మెదక్‌లో 10, పటాన్‌ చెరులో 12.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి.

6 /7

దట్టమైన పొగ మంచులో వాహనాలు వెళ్లేందుకు దారులు కనిపించడంలేదు. చాలా ప్రాంతాల్లో ఉదయం 10 గంటలు దాటితే గానీ మంచు వీడటం లేదు. చలికి చల్లగాలులు తోడవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

7 /7

దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నవారు, వృద్ధులు, చిన్నారులు చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం ఉద్యోగాలకు వెళ్లేవారు, రైతులు, కార్మికులు, ఇతర పనులు చేసుకునేవారు సైతం బయటకు వెళ్లడానికి జంకుతున్నారు.