Fun Bucket Bhargav Prison: తనతో యూట్యూబ్ వీడియోలు, సిరీస్‌లు చేయిస్తూనే ఆమెను లోబర్చుకుని గర్భవతిని చేసిన ప్రముఖ యూట్యూబర్‌కు విశాఖపట్టణం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బాలికపై పలుమార్లు బలాత్కారం చేయడమే కాకుండా బాలిక గర్భవతి కావడంతో అతడి గుట్టు రట్టయ్యింది. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో అతడి బండారం బయటపడడంతో న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.4 లక్షల భారీ జరిమానా విధించింది. ఈ తీర్పు విశాఖపట్టణంతోపాటు సోషల్ మీడియా ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: Pushpa 2 The Rule: రామ్‌చరణ్, బాలయ్యకు భారీ షాక్.. సడన్ ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్
విశాఖపట్టణానికి చెందిన చిప్పాడ భార్గవ్ యూట్యూబర్‌గా రాణిస్తున్నాడు. ఫన్ బకెట్ అనే ఛానల్‌లో పని చేస్తూ యూట్యూబ్ ద్వారా భార్గవ్ (25) వినోదం అందించేవాడు. స్కిట్‌లు, ప్రాంక్‌లు, సిరీస్‌లు వంటివి చేస్తూ ఫన్ బకెట్ భార్గవ్‌గా గుర్తింపు పొందారు. 2021లో భార్గవ్ ఓ బాలికను (14) టిక్‌టాక్ వీడియోలు తీస్తానని చెప్పి ఇంటికి తీసుకెళ్లాడు. బాలిక దుస్తులు మార్చుకొనే నగ్న వీడియోలు తీశాడు. అనంతరం ఆ వీడియోలతో బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తనపై జరిగిన లైంగిక దాడిని బయటకు చెబితే ఆ వీడియోలను సామాజిక మాధ్యమాలలో బయటపెడతానని బెదిరించాడు.
Also Read: Rajinikanth: కంట్రోల్ తప్పిన సూపర్ స్టార్ రజనీకాంత్.. ఎయిర్‌పోర్టులో మీడియాపై చిందులు
ఈ సమయంలో కొన్ని రోజులకు బాలిక అస్వస్థతకు గురవగా ఆస్పత్రికి తీసుకెళ్లితే 4 నెలల గర్భిణి అని వైద్యులు తెలిపారు. కుటుంబసభ్యులు ఆరాతీయగా భార్గవ్ చేసిన లైంగిక దాడిని వివరించింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో విశాఖపట్నం స్పెషల్ పోక్సో కోర్టు జడ్జి ఆనంది విచారణ చేపట్టి శుక్రవారం భార్గవ్‌కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.4 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఫన్ బకెట్ పేరుతో భార్గవ్ ఇలాంటివి ఎన్నో చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. కాగా ఇటీవల వరుసగా సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన వారు వివిధ కేసుల్లో దోషులుగా తేలుతున్నారు. ఇటీవల కొందరు నటీనటులపై కూడా కేసులు నమోదైన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.