KT Rama Rao: కేటీఆర్‌కు భారీ ఊరట.. ఏసీబీ విచారణకు లాయర్‌తో ఒకే!

Big Relief To KT Rama Rao High Court Allowed Lawyer: ఫార్ములా ఈ కారు కేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌కు భారీ ఊరట లభించింది. ఏసీబీ విచారణకు న్యాయవాదితో హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. ఈ పరిణామంతో కేటీఆర్‌ అరెస్ట్‌ ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 8, 2025, 08:02 PM IST
KT Rama Rao: కేటీఆర్‌కు భారీ ఊరట.. ఏసీబీ విచారణకు లాయర్‌తో ఒకే!

Big Relief To KTR: ఫార్ములా ఈ కారు వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, నాటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను జైలుకు పంపించాలనే కుట్ర జరుగుతోంది. ఈ క్రమంలో ఆ కుట్రను తిప్పికొట్టేందుకు మాజీ మంత్రి కేటీఆర్‌ హైకోర్టును ఆశ్రయించగా కొంత ఊరట లభించింది. ఏసీబీ విచారణకు న్యాయవాదితో వెళ్లేందుకు కేటీఆర్‌కు ఉన్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. సీసీ టీవీ పర్యవేక్షణలో విచారణ జరగాలని ఆదేశించింది.

Also Read: KT Rama Rao: 'అది లొట్టపీసు కేసు.. రేవంత్ రెడ్డి ఒక లొట్టపీసు సీఎం'.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

ఫార్ములా ఈ కార్‌ రేస్‌ కేసులో ఏసీబీ విచారణపై కేటీఆర్‌ హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు తన న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ లంచ్‌ మోహన్‌ పిటిషన్‌ దాఖలు చేయగా దానిపై హైకోర్టు బుధవారం విచారణ చేసింది. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతిచ్చి మధ్యాహ్నం విచారణ జరిపింది. సీసీ టీవీ పర్యవేక్షణలో కేటీఆర్‌ను‌ విచారణ చేయాలని ఏసీబీకి హైకోర్టు న్యాయమూర్తి కీలక ఆదేశాలు ఇచ్చారు. విచారణ జరుగుతుండగా లైబ్రరీ రూంలో లాయర్‌ కూర్చునేందుకు అనుమతి ఇస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.

Also Read: BRS Party: 'ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌ మల్లెపువ్వు లాగా బయటకు వస్తాడు'

కేటీఆర్‌ ఓగదిలో.. లాయర్‌ మరో గదిలో ఉండాలని హైకోర్టు ఏసీబీకి సూచించింది. అయితే ఆడియో, వీడియో రికార్డింగ్‌కు మాత్రం ధర్మాసనం అనుమతి ఇవ్వలేదు. అయితే ఏమైనా అభ్యంతరాలు ఉంటే కోర్టుకు రావొచ్చని హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు. ఫార్ములా ఈ-కార్‌ రేస్ కేసులో కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసిన నేపథ్యంలో ఆ తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారని సమాచారం. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏసీబీ కేసును కొట్టివేయాలని కేటీఆర్ పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత.. ఆ తీర్పుపై న్యాయ నిపుణులతో సలహాలు తీసుకుని సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు నిర్ణయించుకున్నట్లు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్గాలు తెలిపాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News