Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక తర్వాత ఇంటికి తిరిగి వెళుతున్న అభిమానుల మృతిపై రామ్ చరణ్ సంతాపం ప్రకటించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 4న ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఏపీ ఉప డిప్యూటీ సీఎం, జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఛీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ వేడుకకు కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) అనే ఇద్దరు యువకులు హాజరయ్యారు. వాళ్లిద్దరూ బైకు మీద ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో వడిశలేరులో ప్రమాదవశాత్తు ఒక వ్యాన్ డీ కొట్టడంతో మరణించారు.
అభిమానుల మృతిపై రామ్ చరణ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆ ఘటన గురించి తెలిసిన వెంటనే ఫ్యాన్స్ ఇంటికి సన్నిహితులను తన మనుషులను పంపించి ధైర్యం చెప్పించారు. వారి ఫ్యామిలీకి చెరొక రూ. 5లక్షల ఆర్థిక సాయాన్ని అనౌన్స్ చేశారు. రామ్ చరణ్ మాట్లాడుతూ... ''ఈవెంట్ దగ్గరకు వచ్చిన అభిమానులు సురక్షితంగా ఇంటికి వెళ్లాలని కోరుకుంటాము. మన ఏపీ డిప్యూటీ సీఎం, బాబాయ్ పవన్ కల్యాణ్ కోరుకునేది కూడా అదే. ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. అభిమానుల కుటుంబాలు ఎంత బాధ పడతాయో అర్థం చేసుకోగలను. నాకు అంతే బాధగా ఉంది. ఫ్యాన్స్ కు సంబంధించిన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు.
ఇప్పటికే బాధిత కుటుంబాలకు జనసేన తరుపున పవన్ కళ్యాణ్ చెరో రూ. 5 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు. అటు ప్రభుత్వం తరుపున సాయం అందిస్తామని అనౌన్స్ చేశారు. అటు నిర్మాత దిల్ రాజు.. ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు చెరో రూ. 5 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.