/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

న్యూడిల్లీ: మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సొంత పార్టీలోనే రోజుకో సవాల్ ను ఎదుర్కొంటోంది. పార్టీ యువ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా సంక్షోభానికి కేంద్రంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నట్లు తెలిపారు. కాగా బీజేపీ  పాలిత రాష్ట్రమైన కర్ణాటకలోని బెంగళూరుకు తనకు విధేయులైన 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రహస్య ప్రాంతానికి తరలించారు. కాగా ఒకప్పుడు గాంధీ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియా పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విచారం వ్యక్తం చేశారు. సింధియాతో రాజీ కోసం కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని త్వరలోనే సంక్షోభం నుండి బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

230 మంది సభ్యులు గల అసెంబ్లీలో, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ నేతృత్వంలో 120 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో  114 మంది కాంగ్రెస్‌కు చెందినవారు కాగా, ఇద్దరు బీఎస్పీ నుండి, ఒకరు ఎస్పీ, ముగ్గురు స్వతంత్రులతో మ్యాజిక్ సంఖ్యను దాటి నలుగురు ఎక్కువగా ఉన్నారు.  మరోవైపు, బీజేపీకి 107 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ప్రస్తుతం రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఒకవేళ 17 మంది నిష్క్రమించినట్లయితే భారత జాతీయ కాంగ్రెస్ తీవ్ర సంక్షోభం లో ఇరుక్కున్నట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మధ్య ప్రదేశ్ చేజారితే కాంగ్రెస్ తన రెండవ రాష్ట్రాన్ని కోల్పోయినట్లవుతుంది. తిరుగుబాటు ఎమ్ఎల్ఏ లను తమ వైపు తిప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు మొదలుపెట్టింది. కాగా  సంక్షోభానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Section: 
English Title: 
Madhya Pradesh: Jyotiraditya Scindia Fly Out 17 Pro-MLA's
News Source: 
Home Title: 

మధ్య ప్రదేశ్ రాజకీయ సంక్షోభం: కాంగ్రెస్ నుండి మరో రాష్ట్రం 'చే'జారనుందా?

మధ్య ప్రదేశ్ రాజకీయ సంక్షోభం: కాంగ్రెస్ నుండి మరో రాష్ట్రం 'చే'జారనుందా?
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
మధ్య ప్రదేశ్ రాజకీయ సంక్షోభం: కాంగ్రెస్ నుండి మరో రాష్ట్రం 'చే'జారనుందా?
Publish Later: 
No
Publish At: 
Monday, March 9, 2020 - 19:44