Chennai Based Logistics Company Gifts To Royal Enfield Bullets And Cars: కంపెనీలు ఉద్యోగులను కడుపులో పొట్టలో పెట్టుకుని చూసుకోవాల్సి ఉంది. కానీ చాలా కంపెనీలు అధిక శ్రమ.. తక్కువ వేతనం.. ఇతర ప్రయోజనాలు కల్పించకపోవడం వంటివి చేస్తుంటాయి. కానీ ఓ చెన్నై కంపెనీ తమ ఉద్యోగులకు భారీగా రివార్డులు ప్రకటించింది. బుల్లెట్లు, కార్లు అందించింది.
ఉద్యోగులకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తే కంపెనీ అభివృద్ధికి ఎంతో దోహదమవుతుంది. ఉద్యోగులు మరింత చురుగ్గా పని చేసి కంపెనీని లాభాల బాటలో తీసుకువస్తారు.
చెన్నైలోని సర్మౌంట్ లాజిస్టిక్స్ అనే కంపెనీ ఉద్యోగులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ వారి అభివృద్ధిలో భాగమైంది. ఫలితంగా కంపెనీ ప్రారంభించిన కొన్నాళ్లకే లాభాల బాట పట్టింది.
ఇక తమ హెచ్‌ఆర్ విధానంలో కూడా ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు కానుకలు అందిస్తామని సంస్థ యజమాని డెంజిల్ రాయన్ ముందే నిర్ణయించుకున్నారు.
హెచ్‌ఆర్ విధానంలో భాగంగా కష్టపడి పని చేసిన వారిని.. గొప్ప లక్ష్యాలు సాధించిన వారికి తాజాగా సర్మౌంట్ లాజిస్టిక్స్ 20 మంది ఉద్యోగులను ఎంపిక చేసింది.
ఎంపిక చేసిన 20 మంది ఉద్యోగులకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, టాటా కార్లు కంపెనీ అందించింది.
కష్టపడి పని చేసిన వారిని గుర్తించి ప్రోత్సహిస్తామని కంపెనీ యజమాని డెంజిల్ రాయన్ తెలిపారు.