Roja daughter wedding: సినీ ఇండస్ట్రీలో సెలబ్రెటీలు భారీ పాపులారిటీ అందుకున్న తర్వాత వారి వారసులు మీడియా ముందుకు లేదా సోషల్ మీడియాలో కనిపిస్తే మాత్రం వెంటనే పుకార్లు సృష్టించేస్తారు. ఈమధ్య కాలంలో నెటిజన్స్ కూడా ఇలా కామెంట్లు చేయడంతో.. ఈ విషయాలు మరింత వెలుగులోకి వస్తున్నాయి
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న రోజా సెల్వమణి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకున్న ఈమె ఆ తర్వాత తన నటనతో భారీ పాపులారిటీ అందుకుంది. రోజా నటిస్తే ప్రతి సినిమా హిట్ అనేలా గుర్తింపు అందుకుంది.
ఇక రోజా ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు జబర్దస్త్ వంటి కార్యక్రమంలో జడ్జిగా కూడా పనిచేసింది. అంతేకాదు రాజకీయ రంగంలో కూడా చక్రం తిప్పింది రోజా. మొదట తెలుగుదేశం పార్టీలో చేరిన ఈమె ఆ తర్వాత వైసీపీలోకి వచ్చి రెండుసార్లు నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి బాధ్యత కూడా చేపట్టింది. ఇక ఈసారి ఎన్నికలలో పోటీ చేసింది. కానీ అనూహ్యంగా ఘోర పరాభవాన్ని చవి చూసింది అని చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా రోజా కూతురుకి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.రోజా కూతురు అన్షు మాలిక గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన తల్లితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరింత పాపులారిటీ అందుకుంది. అంతేకాదు అన్షు మాలిక అందం విషయంలో కూడా తల్లి కంటే ఒక మెట్టు ఎక్కువే అని చెప్పవచ్చు.
అందం విషయంలోనే కాదు తెలివితేటల్లో కూడా ఎప్పుడూ ముందుంటుంది. ఇది ఇలా ఉండగా అన్షు మాలిక టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో ఇంటికి కోడలిగా వెళ్ళబోతోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజాకు ఇదే ప్రశ్న ఎదురవగా ఆమె ఆశ్చర్యపోయారు. ఇక దీనిపై స్పందిస్తూ అన్షు మాలిక గురించి వస్తున్న వార్తలు నిరాధారమైనవి. ప్రస్తుతం తాను సైంటిస్ట్ అవ్వాలనే బలమైన కోరికతో ముందుకు సాగుతోంది.
దయచేసి ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయకండి అంటూ రోజా తెలిపింది. అంతేకాదు అన్షు మాలిక ఇండస్ట్రీలోకి రావడానికి శిక్షణ తీసుకోవడం కోసం అమెరికా వెళ్ళింది అంటూ వార్తలు వస్తున్నాయి. అందులో కూడా నిజం లేదు. తనకి ఇండస్ట్రీలోకి రావాలనే ఆలోచన లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది రోజా.