Fake Cashew Finding Tips: సాధారణంగా గింజలు ఆరోగ్యకరమని వాటిని డైట్ లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతారు. అందుకే ఉదయం పరగడుపున గింజలను డైట్ లో చేర్చుకుంటారు... ఇందులో ముఖ్యంగా జీడిపప్పు, వాల్నట్స్ ఇతర గింజలు ఉంటాయి. అయితే మార్కెట్లో కల్తీ పెరిగింది నకిలీ జీడిపప్పుతో ప్రాణాలు పోతున్నాయి. కొన్ని రకాల చిట్కాలతో గుర్తించాలి.
మీ డైట్ లో చేర్చుకునే ప్రతి వస్తువు అసలైందా కాదా అని గుర్తించడం తెలుసుకోవాలి. లేకపోతే మార్కెట్లో నకిలీ పెరిగింది దీంతో ఆరోగ్య సమస్యలు తప్పవు.
మనము ఆరోగ్యకరమైన తీసుకునే గింజల్లో కూడా నకిలీ విపరీతంగా పెరిగిపోయింది జీడిపప్పు కూడా నకిలీ వస్తుంది దీంతో ప్రాణాలు పోయే పరిస్థితులు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి వీటిని ఎలా గుర్తించాలి తెలుసుకుందాం.
అసలైన జీడిపప్పు రంగు ముఖ్యంగా చూసుకోవాలి ఇది కేవలం తెల్ల రంగులో మాత్రమే ఉంటది. ఎలాంటి మచ్చలు రంధ్రాలు ఉండకూడదు.
అంతేకాదు జీడిపప్పును ఒక శుభ్రమైన నీటిని తీసుకొని అందులో నాలుగు జీడిపప్పు గింజలు వేయండి అది మునిగితే అసలైంది.. లేకపోతే అది కల్తి జీడి పప్పు అని అర్థం.
అంతేకాదు కల్తీ లేని జీడిపప్పు బరువు ఎక్కువగా ఉంటుంది. దీని రుచి కూడా తీపిగా ఉంటుంది. నోట్లో వేయగానే కరిగిపోతుంది. ఈ చిట్కాలు పాటించి నకిలీ జీడిపప్పును సులభంగా కనిపెట్టవచ్చు.