Gold and Silver prices Today : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.
Gold and Silver prices Today : దేశంలో బంగారం, వెండి ధరలు నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. ఈ లోహాల ధరలు భారీగా తగ్గుతాయని భావించిన పసిడి ప్రియులకు మరోసారి షాక్ తగిలిందనే చెప్పవచ్చు. ఎందుకంటే భారీగా తగ్గుతాయని భావించిన ధరలు ఇప్పుడు పైపైకి చేరుకుంటున్నాయి. ప్రస్తుతం బంగారం ధర 78వేలకు చేరువలో ఉంది.
నేడు బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈరోజు భారతదేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,300. చివరి రోజు ధర 71,290. అదే సమయంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.77,770గా ఉంది. నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ.77,770. అయితే రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
ప్రస్తుతం బంగారం ధర 78వేల వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికాలో చూస్తే ఒక ఔన్సు బంగారం ధర ప్రస్తుతం 2600 డాలర్ల ఉంది. ఈలెక్కన చూసినట్లయితే బంగారం ధర అంతర్జాతీయంగా మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది.
ముఖ్యంగా అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన అనంతరం మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో స్టాక్ మార్కెట్లు కూడా బలం పెంచుకునే ఛాన్స్ కనిపిస్తోంది.
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలను ప్రోత్సహిస్తుందని ఇదివరకే పేర్కొంది. దీంతో ఇప్పటికే బిట్ కాయిన్ లక్ష డాలర్ల మేర దాటింది. ఫలితంగా పెట్టుబడి దారులు తమ ఇన్వెస్ట్ మెంట్లను బంగారం వంటి సురక్షితమైన పెట్టుబడి సాధనాల నుంచి బిట్ కాయిన్ వంటి క్రిప్టో ఆస్తుల వైపు తరలిస్తున్నారు. ఇది కూడా బంగారం తగ్గడానికి ఒక కారణమని చెప్పవచ్చు.
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన అమెరికా చేపట్టే ఈ విధానాల వల్ల భవిష్యత్తులో బంగారం ధర ప్రపంచ వ్యాప్తంగా తగ్గే అవకాశం ఉంది. మూడు నెలలుగా బంగారం ధర ఆల్ టైమ్ రికార్డు స్థాయిని తాకింది. జులై నెలలో 67వేల రూపాయలు ఉన్న బంగారం ధర నవంబర్ నెల నాటికి ఏకంగా 84వేల రూపాయలకు చేరుకుంది. అంటే దాదాపు నాలుగు నెలల వ్యవధిలో బంగారం ధర 17వేల రూపాయల వరకు పెరిగింది.