PM Kisan: పీఎం కిసాన్‌ ఏడాదికి రూ.6,000.. కీలక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం..!

Big Update On PM Kisan: కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధిపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ముఖ్యంగా ఇది  కౌలు రైతులకు బిగ్‌ అప్డేట్ అని చెప్పొచ్చు. ప్రతి ఏడాది రైతుల ఖాతాల్లో రూ.6000 జమా చేస్తోంది.  ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కౌలు రైతులకు పీఎం కిసాన్ వర్తింపు పై బిగ్ అప్డేట్ ఇచ్చారు.  ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
 

1 /9

ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (PMKSN) పై కేంద్ర ప్రభుత్వం బిగ్‌ అప్డేట్‌ ఇచ్చింది. ప్రతి ఏడాది రూ.6000 రైతులకు నేరుగా డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (DBT) ద్వారా జమా చేస్తోంది.  

2 /9

ఏడాదిలో మూడు విడుతల్లో రూ.2,000 చొప్పున మొత్తంగా రూ.6,000 జమా చేస్తోంది. ఇది చిన్నా సన్నకారు రైతులకు ఆర్థికంగా చేయూత అందిస్తోంది.   

3 /9

ఈ పథకం కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరి నుంచి ఈ పథకం ప్రారంభించారు. ఈ పథకంలో చేరాలంటే ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవచ్చు లేదా లోకల్‌ పట్వారీ, రెవెన్యూ ఆఫీసర్‌ను కలిసి రిజిస్టర్‌ చేసుకోవచ్చు.  

4 /9

పీఎం కిసాన్‌ పోర్టల్‌ pmkisan.gov.in ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. మీ స్టేటస్‌ చెక్‌ చేసుకునే సౌలభ్యం కూడా కల్పించారు. అంతేకాదు మీరు కేవైసీ కచ్చితంగా పూర్తి చేస్తేనే ఈ పథకానికి అర్హులు అవుతారు.  

5 /9

దీనికి మీ భూమి పత్రాలు, బ్యాంక్‌ ఖాతా, ఆధార్‌ కార్డు, ఓటర్‌ ఐడీ కలిగి ఉండాలి. మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ మీ ఆధార్‌, బ్యాంకు ఖాతాకు లింక్‌ అయి ఉండాలి.   

6 /9

అయితే, ఇప్పటి వరకు 18 విడుతలు పీఎం కిసాన్‌ డబ్బులను రైతుల ఖాతాల్లో జమా చేశారు. అక్టోబర్‌ 5 ఈ ఏడాది డబ్బులు రైతుల ఖాతాల్లో నేరుగా జమా చేశారు.   

7 /9

19వ విడుత పీఎం కిసాన్‌ డబ్బుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ విడుత డబ్బులను 2025 ఫిబ్రవరి నెలలో విడుదల చేయనున్నారు. ఈలోగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. కేవైసీ పూర్తి చేసుకోవాలి.  

8 /9

ఇదలా ఉండగా పీఎం కిసాన్‌ ప్రతి ఏడాది రూ.6000 కౌలు రైతులకు అందించే ప్రతిపాదన ఇప్పడు ఏం లేదు అని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకు 18 విడుతల్లో రూ.3.46 లక్షల కోట్లు రైతుల ఖాతాల్లో జమా చేశామని చెప్పారు.  

9 /9

ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు, ట్యాక్స్‌ కట్టేవారు ఈ పథకం ద్వారా లబ్ది పొందితే వారి నుంచి కూడా రికవరీ చేస్తున్నాయని కేంద్ర మంత్రి ప్రకటించారు.‌