US Earthquake: అమెరికాను భారీ భూకంపం వణికించింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని పలు కీలక ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై ఏకంగా 7 తీవ్రత నమోదైంది. భూ ప్రకంపనల దాటికి ఉత్తర కాలిఫోర్నియా తీర ప్రాంతం మొత్తం చిగురుటాకులా వణికిపోయింది. అటు పెట్రోలియా, స్కాటియా, కాబ్ తదితర ప్రాంతాల్లో శక్తిమంతమైన భూ ప్రకంపనలు నమోదయ్యాయి. దీంతో పలు చోట్ల ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భూమి కంపించడంతో ప్రజలు భయంతో వణికి పోయారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.44 గంటలకు భూకంపం సంభవించింది.
కాలిఫోర్నియా ఉత్తర తీర ప్రాంతాలపై భూకంప ప్రభావం అధికంగా ఉందని అమెరికా భూ సర్వేక్షణ విభాగం వెల్లడించింది. పశ్చిమ తీరంలో 5.3 మిలియన్ల మందికి సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే కొంత సమయం తర్వాత సునామీ హెచ్చరికను ఉప సంహరించుకున్నారు. అమెరికాలో ఇటీవల కాలం ఇంత తీవ్రతతో భూకంపం సంభవించిన దాఖలాలు లేవు.
భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు యుఎస్‌జిఎస్ తెలిపింది. ఒరెగాన్ సరిహద్దుకు దాదాపు 209 కిలోమీటర్ల దూరంలో హంబోల్ట్ కౌంటీ తీర ప్రాంతంలోని చిన్న పట్టణమైన ఫెర్న్‌డేల్‌కు పశ్చిమాన భూకంపం సంభవించిందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. దీంతో అక్కడ ప్రజలు ఎపుడు ఏం జరుగుతుందో అని బిక్కు బిక్కు మంటూ బ్రతుకు తున్నారు.
ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..
ఇదీ చదవండి: టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.