8th Pay Commission: 8వ వేతన సంఘంపై కీలక ప్రకటన, భారీగా పెరగనున్న ఉద్యోగుల పెన్షన్, జీతాలు

8th Pay Commission Salary Hike in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్‌న్యూస్. 8వ వేతన సంఘం ఏర్పాటుపై కీలక ప్రకటన వెలువడనుంది. 8వ వేతన సంఘం అమల్లో వస్తే ఉద్యోగుల జీతభత్యాలు గణనీయంగా పెరగనున్నాయి. అంతేకాకుండా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ప్రకారం పెన్షన్ భారీగా పెరగనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

8th Pay Commission Salary Hike in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సానుకూల ప్రకటన అందింది. ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘంపై నిరీక్షణకు తెరపడవచ్చు. 2026 నుంచి 8వ వేతన సంఘం అమల్లో రావచ్చని అంచనా. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో వెలువడవచ్చని తెలుస్తోంది. 

1 /6

వాస్తవానికి ప్రతి పదేళ్లకోసారి కొత్త వేతన సంఘం ఏర్పడుతుంటుంది. 7వ వేతన సంఘం 2014లో ఏర్పడి 2016 నుంచి అమల్లోకి వచ్చింది. ఫలితంగా అప్పట్నించి ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలు, పెన్షన్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. 

2 /6

8వ వేతన సంఘం వల్ల ఉద్యోగులకే కాకుండా పెన్షనర్లకు సైతం భారీ ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం పెన్షన్ 9 వేలుంది. ఇది కాస్తా 25,740 రూపాయలకు పెరగనుంది. 

3 /6

అయితే ఫిట్‌మెంట్ ఫ్యాక్ట్రర్ ను ప్రభుత్వం 2.86 శాతానికి పెంచవచ్చని తెలుస్తోంది. అదే జరిగితే ఉద్యోగుల కనీస వేతనం 18 వేల రూపాయల నుంచి ఏకంగా 51,480 రూపాయలకు పెరగనుంది. ఇది ఉద్యోగులకు లభించే అతి పెద్ద గుడ్ న్యూస్ కానుంది.

4 /6

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు , పెన్షన్ పెరగనున్నాయి. 8వ వేతన సంఘం ప్రకారం కొత్త ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ రానుంది. ప్రస్తుతం అంటే 7వ వేతన సంఘం ప్రకారం 2.57 శాతంగా ఉంది. రానున్న 8వ వేతన సంఘం ప్రకారం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.92 శాతం కానుంది. 

5 /6

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కన్సాలిడేటెండ్ పెన్షన్ స్కీమ్ 2025లో ప్రారంభం కానుంది. ఇందులో పదవీ విరమణ చేసిన ఉద్యోగి సగటు జీతంలో సగం పెన్షన్‌గా లభిస్తుంది. అంటే పెన్షనర్ గత ఏడాది జీతంలో సగం పెన్షన్ రూపంలో వస్తుంది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ పొడిగించే అవకాశాలున్నాయి. అదే జరిగితే పెన్షన్ మరింతగా పెరగవచ్చు. 

6 /6

8వ వేతన సంఘం ప్రకారం ఉద్యోగుల జీత భత్యాలు యూపీఎస్ ప్రకారం పెన్షన్ రెండూ గణనీయంగా పెరగనున్నాయి. ఇంటిగ్రేటెడ్ పెన్షన్ ప్లాన్ ప్రయోజనాలేంటి ఉద్యోగులకు కలిగే లాభాలేంటో పరిశీలిద్దాం.