న్యూ ఢిల్లీ : ఉచితాలు, తాత్కాలిక పథకాలతో ప్రజలను మభ్యపెట్టడం సరికాదని, దీర్ఘకాలిక ప్రణాళికలతోనే పేదరిక, నిరక్షరాస్యత నిర్మూలన, సుస్థిరాభివృద్ధి, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ‘ఏకాత్మతా మానవతావాదం’ సారాంశమిదేనని, ‘ద విజన్ ఆఫ్ అంత్యోదయ’ పుస్తకావిష్కరణలో ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు.
స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లయినా, ఇంకా 20% పేదరికం, 20% నిరక్షరాస్యత ఉండేందుకు ఇలాంటి నిర్ణయాలే కారణమన్నారు. బుధవారం ఉపరాష్ట్రపతి భవన్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ మందిరంలో ‘ద విజన్ ఆఫ్ అంత్యోదయ’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. ‘నవభారత నిర్మాణ మార్గదర్శి, శ్రీ పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ బోధించిన ‘అంత్యోదయ’ సూత్రాన్ని అమలుచేసినపుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రజాజీవితంలో ఉన్నవారు ‘అంత్యోదయ’తోపాటుగా సమాజంలో ఐకమత్యం కోసం చిత్తశుద్ధితో కృషిచేయాలఆరు. ఇదే రాజకీయ పార్టీల మొదటి ప్రాధాన్యత కావాలి’ అని అన్నారు.
Deendayal Ji had said-
“We must have such an economic system which helps in the developments of our humane qualities. We should have a system which does not overwhelm our humane quality; which does not make us slaves of its own grinding wheels.” #Antyodaya pic.twitter.com/dkCi3uDm5V— Vice President of India (@VPSecretariat) February 12, 2020
పార్టీ ఫిరాయింపుల చట్టంలోని లోపాలను సవరించాల్సిన అవసరం ఉందని.. చట్టసభ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా వేరే పార్టీలోకి వెళ్లడాన్ని అనుమతించకూడదన్నారు. ప్రతి పార్టీ తమ సభ్యులకు క్రమశిక్షణను నేర్పించడం ద్వారా పార్టీ ఫిరాయింపులను నిరోధించవచ్చని ఉపరాష్ట్రపతి అన్నారు. జీవితంలో ఉన్నత విలువలు పాటించిన శ్రీ పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ వంటి మహనీయుల జీవితాన్ని రేపటి భవిష్యత్ భారతానికి బోధించాల్సిన అవసరం ఉందన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..