Latest Trending Business Idea: మీ ఇంటి పక్కనే ఉండే ఖాళీ ప్రదేశంలో ఇవి సాగు చేస్తూ.. ఏకంగా రూ.5 లక్షలు సంపాదించండి..!

Black Tomato Business Idea: ప్రస్తుతం మార్కెట్‌లో చిన్న వ్యాపారాలకు అధిక డిమాండ్‌ ఉంది. చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాల కంటే విభిన్నంగా ఆలోచించడం,  అధిక ఉత్పత్తులు, సేవలను అందిస్తున్నాయి. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా..? అయితే ఈ వ్యాపారం మీకు బోలెడు లాభాలు తీసుకురావడం ఖాయం. 

1 /8

చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడానికి అధిక పెట్టుబడి, పెద్ద పెద్ద చదువులు అవసరం లేదు. చిన్న ఓ ఆలోచన, బిజినెస్‌ నడిపించే తెలివి తేటలు ఉంటే సరిపోతుంది.   

2 /8

ఇప్పుడు తెలుసుకొనే బిజినెస్ ఇంట్లో మహిళలు, యువతకు మాత్రమే కాకుండా రైతులకు కూడా ఉపయోగపడేది. ఈ బిజినెస్‌తో అనుకున్నదాని కంటే ఎక్కువగా డబ్బు సంపాదించవచ్చు. 

3 /8

నల్ల టమోటాల బిజినెస్‌ రైతులకు ఒక వరం లాంటిది. ఈ వ్యాపారానికి మార్కెట్‌లో భారీ డిమాండ్‌ ఉంది. 

4 /8

నల్ల టమోటాలు ప్రస్తుతం మార్కెట్‌ దృష్టిని మళ్లిస్తున్నాయి. ఎర్రటి టమోటాల కంటే ఇవి బాగా అమ్ముడుపోతాయి.   

5 /8

నల్ల టమోటాలు కేవలం రంగులో మాత్రమే కాదు, పోషక విలువల్లో కూడా ఎర్రటి టమోటాల కంటే భిన్నంగా ఉంటాయి. వీటిలో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.

6 /8

ఈ నల్ల టమోటా పంటను ఎక్కడైనా సాగు చేయవచ్చు. కానీ ఇవి ఎక్కువగా వేడి ఉన్న వాతావరణంలో అధికంగా పండుతాయి. 

7 /8

నల్ల టమోటాలను ఎక్కువగా జనవరి నెలలో సాగు చేయడం మంచిది. మార్చి, ఏప్రిల్ మధ్య మార్కెట్‌లో టమోటాలను అమ్మవచ్చు. 

8 /8

ఈ పంటకు కేవలం విత్తనాలు ఉంటే సరిపోతుంది. నల్ల టమోటా సాగులో హెక్టారుకు 4 నుంచి 5 లక్షల లాభం వస్తుంది.