Priyanka Gandhi Record Win: సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ప్రియాంక గాంధీ తొలి ప్రత్యక్ష ఎన్నికల్లోనే సంచలన విజయం సొంతం చేసుకున్నారు. తన సోదరుడు రాహుల్ గాంధీ వదిలేసిన కేరళలోని వయానాడ్ లోక్‌సభ నుంచి పోటీ చేసి కనీవినీ ఎరుగని రికార్డులో విజయ దుంధుబి మోగించారు. ఓట్ల లెక్కింపు ఫలితాల్లో బ్యాలెట్ ఓట్లు మొదలుకుని ఆఖరి రౌండ్ వరకు తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించి విజయాన్ని నమోదు చేశారు.
ఇది చదవండి: Election Results Live: మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలు.. అధికార కూటములకే మళ్లీ అధికారం
కేరళలోని వయానాడ్ నుంచి తొలిసారి ప్రియాంకా గాంధీ అఖండ విజయం సాధించారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ప్రియాంక ఫలితాల్లో ఆది నుంచి జోరు కనబరుస్తూ ఆఖరి వరకు దూకుడు కనబర్చారు. తన సమీప ప్రత్యర్థి బీజేపీ తరఫున పోటీచేసిన నవ్య హరిదాస్‌కు దాదాపుగా డిపాజిట్ గల్లంతు చేశారు. సీపీఎం అభ్యర్థి సత్యన్ మొకేరిని ఓడించారు. ఈ ఎన్నికల్లో తన సోదరుడు రాహుల్ గాంధీ రికార్డునే బ్రేక్ చేసి షాకిచ్చారు. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ప్రకారం.. ప్రియాంక గాంధీ 3.65 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారని సమాచారం. తుది ఫలితాలు వెల్లడయ్యే వరకు ఓట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇది చదవండి: Maharashtra: ఏక్నాథ్ షిండేకు భారీ షాక్.. తదుపరి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్?
అన్న రికార్డు బ్రేక్..
2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేసి 3,64,653 ఓట్ల ఆధిక్యం పొందారు. రాహుల్‌కు మొత్తం 6,47,445 ఓట్లు పోలయ్యాయి. సీపీఐ అభ్యర్థి అన్నీ రాజాకు 2,83,023 ఓట్లు పోలవగా.. బీజేపీ అభ్యర్థి కె.సురేంద్రన్‌కు 1,41,045 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాగా 2019లో రాహుల్ గాంధీకి సుమారు 4 లక్షల మెజార్టీ లభించింది.
ఉబ్బితబ్బిబైన రాబర్ట్ వాద్రా
తన సతీమణి విజయంపై ఆమె భర్త రాబర్ట్ వాద్రా స్పందించారు. 'ప్రియాంక కృషిని గుర్తించిన వయనాడ్ ప్రజలకు ధన్యవాదాలు. ఆమె కచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తారని తెలుసు. ప్రజల సస్యలను పార్లమెంట్లో వినిపించేందుకు ప్రియాంక శ్రమిస్తారు. ప్రస్తుతం పుస్తకాలు చదవడం.. పిల్లలను చూసుకోవడంలో బిజీగా ఉన్న ప్రియాంక ఇప్పుడు దేశ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఈ ఎన్నికల్లో పోటీ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter