Hanuman idol: తెలంగాణలో మరో దారుణం.. హనుమాన్ విగ్రహం దగ్ధం.. అసలు కారణం ఏంటంటే..?

Bhupalapalli district: తెలంగాణ లోని  ప్రొఫెసర్ జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆంజనేయ స్వామి విగ్రహం మంటలు ఆహుతి అయ్యింది. ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర వివాదంగా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Nov 22, 2024, 01:47 PM IST
  • తెలంగాణలో మరో షాకింగ్ ఘటన..
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు..
Hanuman idol: తెలంగాణలో మరో దారుణం.. హనుమాన్ విగ్రహం దగ్ధం.. అసలు కారణం ఏంటంటే..?

Hanuman idol fire incident: తెలంగాణలో కొన్నిరోజులుగా హిందు దేవాలయాలలోని విగ్రహాలపై దాడులు ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. ఇటీవల సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహంను ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాలితో తన్నుతూ నీచంగా ప్రవర్తించిన ఘటన వైరల్ గా మారిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత శంషాబాద్ లోని నవగ్రహాల విగ్రహాలు, మరో గ్రామదేవత ఆలయంలో కూడా ఇటీవల విగ్రహాల ధ్వంసం ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా హిందు సంఘాలు మాత్రం ఈ వరుస ఘటనలో ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మరో షాకింగ్ ఘటన ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా భూపాల పల్లిలో  ఈ ఘటన చోటు చేసుకుంది.

పూర్తి వివరాలు..

ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తొంది. ముఖ్యంగా భక్తులు కార్తీక మాసంను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ నెలంతా మద్యం, మాంసాదులకు దూరంగా ఉంటారు. ఈ క్రమంలో ప్రతిరోజు దగ్గరలోని ఆలయంకు తప్పనిసరిగా వెళ్తుంటారు. అయితే.. తాజాగా.. జయశంకర్ జిల్లా భూపాల పల్లి జిల్లా మహాదేవ్ పూర్ మండలంలో  షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అంబటి పల్లిలో జరిగిన ఘటన ప్రస్తుతం పెనుదుమారంగా మారింది. ఇక్కడ స్థానికంగా అమరేశ్వర ఆలయం ఉంది. ఆంజనేయ స్వామి ఈ ఆలయంలో భక్తులతో పూజలు అందుకుంటారు.

అయితే.. ఏమైందో కానీ.. ఈరోజు ఆంజనేయ స్వామి విగ్రం నిప్పులు అంటుకున్నాయి. హనుమయ్య ఆలయం అంతా అగ్నీకీలలు వ్యాపించాయి. చుట్టురా నల్లని పొగ వ్యాపించింది. దీంతో అక్కడికి వచ్చిన భక్తులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. మంటలు ఎగిసి పడుతూ.. చూస్తుండగానే విగ్రహం అంతా కాలిపోయింది. ఈ ఘటనకు మాత్రం కారణాలు తెలియరాలేదు. మరీ కావాలని చేశారా.. లేదా.. ఏదైన ప్రమాదం జరిగిందా..అనేది తెలియాల్సి ఉంది.

Read more: Garikapati Narasimharao: తగ్గెదేలా అంటావా..?.. మీ అందర్ని కడిగేస్తా.. పుష్పా- 2 మీద రెచ్చిపోయిన గరికపాటి.. వీడియో ఇదే..

స్థానికులు మాత్రం  దీనిపై విచారణ జరిపి.. నిజ నిజాలు వెలుగులోకి తీసుకొని రావాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆలయం దగ్గరకు చేరుకున్నట్ల తెలుస్తొంది. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని గొడవలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తొంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News