అఖిల పక్షంలో బీజేపీపై విపక్ష నాయకుల ఘాటైన విమర్శలు

పౌరసత్వ చట్టంపై అసహనాన్ని వ్యక్తం చేసిన శిరోమణి అకాలీదళ్ నాయకుడు మాట్లాడుతూ.. ప్రజలను విభజించే చట్టాన్ని ఆమోదించవద్దని బీజేపీ ప్రభుత్వాన్ని కోరారు. పౌరులు, మైనారిటీలను బాధించే చట్టాన్ని చట్టసభ సభ్యులు ఆమోదించరాదని అకాలీదళ్ నాయకుడు సర్దార్ బల్విందర్ సింగ్ బందర్ గురువారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో అన్నారు.పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో

Last Updated : Jan 30, 2020, 06:34 PM IST
అఖిల పక్షంలో బీజేపీపై విపక్ష నాయకుల ఘాటైన విమర్శలు

న్యూఢిల్లీ : పౌరసత్వ చట్టంపై అసహనాన్ని వ్యక్తం చేసిన శిరోమణి అకాలీదళ్ నాయకుడు మాట్లాడుతూ.. ప్రజలను విభజించే చట్టాన్ని ఆమోదించవద్దని బీజేపీ ప్రభుత్వాన్ని కోరారు. పౌరులు, మైనారిటీలను బాధించే చట్టాన్ని చట్టసభ సభ్యులు ఆమోదించరాదని అకాలీదళ్ నాయకుడు సర్దార్ బల్విందర్ సింగ్ బందర్ గురువారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో అన్నారు.పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆమోదించిన పౌరసత్వం (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో నిరసనల నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు ఈ వ్యాఖ్యలు చేశారు. 

శిరోమణి అకాలీదళ్, భారతీయ జనతా పార్టీ ల మధ్య సఖ్యత ఉన్నప్పటికీ, ఇటీవల కొన్ని వారాలపాటు  పౌరసత్వ చట్టంపై తన ఆభిప్రాయాని మార్చింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తును విరమించుకుంది. మొదట్లో పౌరసత్వ సవరణ చట్టంపై తమ అభిప్రాయ భేదాన్ని ముఖ్య కారణంగా చూపి శిరోమణి అకాలీదళ్ బీజేపీని ఈ ఎన్నికలల్లో దూరం పెట్టింది. 

ఆ తరవాత పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.బీజేపీ తన పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశంలో అకాలీదళ్ ప్రతినిధి మైనారిటీలపై జరుగుతున్న దాడులపై తీవ్రంగా స్పందించారని, దీంతో చాలా మంది ప్రతిపక్ష నాయకులు  ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలిపారు.

అఖిల పక్ష సమావేశంలో ప్రతిపక్ష నాయకులు ఈ చట్టాన్ని తీవ్రంగా విమర్శించారని, ఈ సమావేశంలో, AIADMK మినహా మిగతా విపక్ష నాయకులు పౌరసత్వ చట్టం అమలును తీవ్రంగా విమర్శించారని తెలిపారు.

గులాం నబీ ఆజాద్, రామ్ గోపాల్ యాదవ్ సహా ప్రతిపక్ష నాయకులు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఓమర్ ను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News