Cabinet aproved for andhrapradesh state council Desolve : ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దుకే కేబినెట్ మొగ్గు

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ శాసన మండలి రద్దుపై మరో ముందడుగు పడింది. ఇప్పటికే మండలిని రద్దు చేస్తారని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ చర్చలను నిజం చేస్తూ .. మండలి రద్దుకే ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం మొగ్గు చూపింది. ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం .. దాదాపు గంటపాటు ఈ అంశంపై చర్చించింది.

Last Updated : Jan 27, 2020, 10:51 AM IST
Cabinet aproved for andhrapradesh state council Desolve : ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దుకే కేబినెట్ మొగ్గు

ఊహించిందే జరిగింది.. ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ శాసన మండలి రద్దుపై మరో ముందడుగు పడింది. ఇప్పటికే మండలిని రద్దు చేస్తారని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ చర్చలను నిజం చేస్తూ .. మండలి రద్దుకే ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం మొగ్గు చూపింది. ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం .. దాదాపు గంటపాటు ఈ అంశంపై చర్చించింది.  ఆ తర్వాత మంత్రివర్గం మొత్తం ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని రద్దు చేయాలనే తీర్మానాన్ని మంత్రివర్గం ఆమోదించింది. 

అసెంబ్లీకి నేడు మండలి రద్దు తీర్మానం 
మండలి రద్దు తీర్మానాన్ని ఇవాళ (సోమవారం)  అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. అసెంబ్లీలో  ఈ  బిల్లుపై చర్చ జరగనుంది. అక్కడ  కూడా ఈ తీర్మానంపై ఆమోద ముద్ర పడిన తర్వాత .. రాష్ట్ర గవర్నర్ ఆమోదం కోసం పంపిస్తారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి కూడా ఓ ప్రతిని పంపిస్తారు. ఆ తర్వాత అధికారికంగా శాసన మండలిని రద్దు చేస్తున్నట్లు అధికారికంగా నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది. అసెంబ్లీలో  ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు తీర్మానం  నేడు రానున్న నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు చేస్తారని ముందు నుంచీ ఊహిస్తున్న టీడీపీ ముందస్తుగానే ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీ శాసన మండలిని రద్దు చేసే తీర్మానం ప్రవేశ పెట్టే రోజు .. చరిత్రలో చీకటి రోజుగా నిలిచిపోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు  అన్నారు. అలాంటి దానికి తమ మద్దతు ఇవ్వమని ప్రకటించారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..   

 

Trending News