రాంగోపాల్ వర్మ నంది అవార్డులు, లెజెండ్ సినిమాపై వ్యంగ్యాస్త్రాలు

రాంగోపాల్ వర్మ నంది అవార్డులు, లెజెండ్ సినిమాపై పేస్ బుక్ లో తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.

Last Updated : Nov 17, 2017, 12:19 PM IST
    • నంది అవార్డు కమిటీకి ఆస్కార్ ఇవ్వాల్సిందే
    • ప్రపంచంలోనే ఇంత అద్భుత కమిటీ ఉండి ఉండదు
    • టైటానిక్ జేమ్స్ బోయపాటి కాళ్ళు పట్టుకుంటాడు
రాంగోపాల్ వర్మ నంది అవార్డులు, లెజెండ్ సినిమాపై వ్యంగ్యాస్త్రాలు

నంది అవార్డులు ప్రకటించిన తరువాత రోజుకో దుమారం లేస్తోంది. ఆ సినిమాకు అంతసీన్ లేదని, ఈ సినిమాకు అవార్డు వచ్చి ఉంటే  బాగుండేదని, అవార్డుల విషయంలో కమిటీ ఏకపక్ష ధోరణి అవలంభించిందని..  ఆరోపణలు చేస్తున్నారు.

సినిమా నటుడు ఆర్. నారాయణమూర్తి 'రుద్రమదేవి' సినిమాకు నంది అవార్డు రావలసింది అని అన్నారు. అంతకు ముందే ఆ సినిమా దర్శకుడు గుణశేఖర్ కూడా నంది అవార్డు ప్రకటనలపై అసంతృప్తి తెలిపారు. తాజాగా నంది అవార్డుల మీద రామ్ గోపాల్ వర్మ తనదైన రీతిలో పేస్ బుక్ ఖాతాలో వ్యంగ్యాస్త్రాలు చేశారు.

నంది అవార్డు కమిటీకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి

-  "అబ్బో అబ్బో అబ్బో!!! ఇప్పుడే నంది అవార్డ్స్ లిస్ట్ మొత్తం చూసా...వామ్మో మైండ్ బ్లోయింగ్ ఎక్స్ట్రార్డినరీ సూపర్ డూపర్ సెలక్షన్.. నాకు తెలిసి ఇలా ఏమాత్రం 1% పక్షపాతం లేకుండా కేవలం మెరిట్ మీద మాత్రమే అవార్డ్స్ ఇచ్చిన కమిటీ మొత్తం ప్రపంచంలోనే ఉండి ఉండదు.. ఇంత అద్భుతమైన నిజాయతీ గల నంది అవార్డు కమిటీకి ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే.. వావ్ నంది అవార్డ్స్ కమిటి మెంబర్లూ ఐ వాంట్ టు టచ్ ఆల్ యువర్ ఫీట్.. "అని వ్యాఖ్యానించారు. 

'లెజెండ్' చూస్తే టైటానిక్ జేమ్స్ బోయపాటి కాళ్ళు పట్టుకుంటాడు

- "లెజెండ్ సినిమాకి ఇచ్చిన అవార్డుల మీద కాంట్రవర్సీ ఏంటో నాకు అర్ధమవ్వట్లేదు.. అది కేవలం జెలసి ఉన్నవాళ్లు కాంట్రవర్సీ చేస్తున్నారు...నిజానికి జేమ్స్ కెమరూన్ గాని లెజెండ్ చూస్తే టైటానిక్ కి తన కొచ్చిన 11 ఆస్కార్ అవార్డుల్ని బోయపాటి శ్రీను కాళ్ళ దగ్గర పెట్టి సాష్టాంగ నమస్కారం పెడతాడు." అని ఫేస్ బుక్ లో వ్యాఖ్యానించారు. <

  <

>

Trending News